కట్టప్ప మంచోడు కాదంటూ.. బాహుబలి-2పై అక్కడ బ్యాన్?? | Kattappa troubles for Baahubali 2 release.

Baahubali 2 troubles with kattappa old speech

Baahubali The Conclusion, Baahubali 2 Release, Baahubali Kattappa, Kattappa Kauvery Speech, Kattappa Ketteppa, Satyaraj Hate Speech, Actor Sathyaraj Kannadigas, Baahubali 2 Release Postponed, Kattappa Baahubali 2 Release, Baahubali 2 karnataka Release, Karnataka Kattappa

Kattappa hate speech on troubles for Baahubali release in karnataka. Actor Sathyaraj had earlier given a speech over the Kauvery issue, and that has not gone down well with some of the Kannadigas.

కట్టప్ప మూలంగా బాహుబలి-2 కష్టాలు

Posted: 03/22/2017 03:57 PM IST
Baahubali 2 troubles with kattappa old speech

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బాహుబలి పార్ట్ 2 విషయంలో కర్ణాటకలో కొత్త వివాదం రాజుకుంటోంది. సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థ కంక్లూజన్ ను రిలీజ్ కానియబోమని, దానిని బ్యాన్ చేసి తీరాలన్న కొత్త డిమాండ్ ను లేవనెత్తున్నారు. ఇందుకు కారణం కట్టప్ప చేసిన ఓ పనే కావటం మరో విశేషం.

ఇంతకీ విషయం ఏంటంటే.. కావేరి జలాల వివాద సమయంలో కోలీవుడ్ తరపున జరిగిన ప్రదర్శనలో సత్యరాజ్ చేసిన ప్రసంగమే. ఆ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇరు రాష్ట్రాల సమస్యపై కాస్త కూల్ గా స్పీచ్ ఇవ్వగా, దానిని వ్యతిరేకిస్తూ ఈ సీనియర్ నటుడు స్వరం పెంచి మాట్లాడాడు. కన్నడ గుడిలను హేళన చేస్తూ ఆయన చేసిన ప్రసంగంపై అప్పట్లో కన్నడ ప్రజలు ఘాటు విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు అవకాశం రావటంతో బాహుబలి రూపంలో సత్యరాజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు.

బళ్లారిలో ఈ మధ్యే ఓ వేదికను ఏర్పాటు చేసిన కొందరు అక్కడి థియేటర్లలో బాహుబలి-2 ట్రైలర్ ను అడ్డుకోవటమే కాదు, నినాదాలతో హోరెత్తించారు. కట్టప్ప ఓ కెట్టప్ప(కెట్ట అంటే కన్నడలో చెడ్డ అని అర్థం), ఎట్టి పరిస్థితుల్లో అతను నటించిన ఈ సినిమాను రిలీజ్ కానీయబోమని, ఖచ్ఛితంగా అడ్డుకుని తీరతామని వారంటున్నారు. ఇంతకు ముందు బాహుబలి-2 ని కన్నడ భాషలో అనువాదం చేసి విడుదల చేస్తాన్న సమయంలో నటుడు జగ్గేశ్ థియేటర్లు తగలబడతాయంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు స్ట్రెయిట్ వర్షన్ కి కూడా ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Actor Sathyaraj  Hate Speech  Kauvery Issue  

Other Articles

Today on Telugu Wishesh