మురగదాస్ లైట్.. మహేష్ మైండ్ లో కొరటాల ప్రాజెక్టే ఉందా? | Mahesh babu priority to Koratala Siva Project.

Next schedule of mahesh 23 in vietnam

Mahesh Babu Murugadoss Movie, Mahesh Babu 2017, Mahesh Babu Murugadoss next Schedule, Vietnam Mahesh Babu, Mahesh Babu Hurry for Koratala Siva, mahesh Babu Koratala Bharath Ane Nenu, Mahesh Murugadoss movie, Mahesh Babu Murugadoss Audio

Mahesh Babu and Murugadoss team to travel to Vietnam for next schedule of upcoming film. Audio likely to may 28 and Movie June release on June 23rd.

వియత్నాంకు మహేష్-మురగదాస్ సినిమా

Posted: 03/22/2017 04:28 PM IST
Next schedule of mahesh 23 in vietnam

మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది మురగదాస్ సినిమా. సుమారు 110 కోట్లతో బైలింగువల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. జనవరికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ఈ సినిమాను కావాలనే షెడ్యూల్ ను పొడిగించుకుంటూ వస్తున్నాడు మురగదాస్. అయితే మే నుంచి కొరటాల శివ సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితిల్లో ప్రారంభించాలని డిసైడ్ అయిన మహేష్ త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నాడంట.

దీంతో చకచకా షెడ్యూల్ పూర్తి చేసే పనిలో పడ్డాడు స్టార్ దర్శకుడు. ఇందులో భాగంగా వియత్నాంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు యూనిట్ బయలుదేరబోతుంది. వారంపాటు అక్కడే ఉండి హీరోకి, విలన్ గ్యాంగ్ కి మధ్య జరిగే ఫైట్ సీన్లను తీస్తారంట. విదేశాల్లో ఈ సినిమాకు ఇదే చివరి షెడ్యూల్ కానుంది.

ఇక మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటించబోతున్న ఈ చిత్రంలో రకుల్, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తున్నారు. ఉగాదికి ఫస్ట్ లుక్, మే 28న ఆడియో మరియు రంజాన్ సందర్భంగా జూన్ 23న సినిమాను రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. స్పైడర్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  Vietnam Schedule  

Other Articles

Today on Telugu Wishesh