నైటీలో ఉన్నా... రేప్ కోసం మెంటల్ గా ప్రిపేర్ అయ్యా... | Kim was sure she was going to be raped.

Kim kardashian finally open up on paris heist

Kim Kardashian, Kim Kardashian Rape, Kim Kardashian Paris Heist, Paris Heist Hollywood Star, Paris Heist Culprits, Kim Kardashian Rape Moment, Kim Kardashian Fear, Kim Rape and Death

Kim Kardashian finally open up on Paris Heist. She was 'mentally prepped' for rape, death during that time.

భయానక ఎక్స్ పీరియన్స్ గురించి కిమ్

Posted: 03/21/2017 01:50 PM IST
Kim kardashian finally open up on paris heist

నటి కమ్ మోడల్ కిమ్ కర్దాషియన్ కు గతేడాది ప్యారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఎదురైన భయానక అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గన్ లతో వచ్చిన దుండగులు ఈ సెక్సీ స్టార్ ను బంధించి మొత్తం దోచుకుని పోయారు. అయితే ఆ ఘటన గడిచి ఐదు నెలలు అవుతున్నా ఇప్పటికీ కిమ్ ఆ షాక్ నుంచి కోలుకోలేదు. ఫ్రోఫైల్ మెయింటెన్ చేయటమే కాదు, ఎక్కడా కూడా ఆ టాపిక్ గురించి ప్రస్తావించకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.

సంచలన రేపిన ఆ దోపిడీపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది ఈ బ్యూటీ. ‘‘నా కార్యక్రమాలు పూర్తి కావటంతో ఫ్లాట్ కి చేరి పడుకునేందుకు సిద్ధం అయ్యా. కేవలం నైట్ డ్రెస్ లో మాత్రమే ఉన్నా. హఠాత్తుగా ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. పారిపోదామని ప్రయత్నిస్తే వాళ్లు నన్ను కాల్చి చంపటం ఖాయం. వారు మాట్లాడే భాష నాకు అర్థం కాలేదు. అందులో ఒకడు నా చేతులను సంకెళ్లతో బంధించి, నోటికి టేప్ వేశాడు. తర్వాత నన్ను బెడ్ మీదకు తోశాడు. లో దుస్తులు కూడా లేకపోవటంతో ఆ క్షణం వాళ్లు నన్ను రేప్ చేయటం ఖాయం అనుకున్నా.

కానీ, వాళ్లు అలా చేయలేదు. డబ్బు, నగలు మొత్తం సర్దుకున్నాక నన్ను బాత్ టబ్ లోకి పడేసి పారిపోయారు. దేవుడి దయ వల్ల మాన, ప్రాణాలతో బయట అంటూ కిమ్ అందులో తెలిపింది. గతంలో ఇదే విషయాన్ని ఆమె సోదరి తెలుపగా, ఇప్పుడు కిమ్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేయటం విశేషం. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ యేడాది జనవరిలో 16 మందిని పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  Paris Heist  Rape Fear  

Other Articles