సినిమా పోయింది.. ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది | Aishwarya Rai Bachchan bags IFFAA award for Sarbjit.

Aishwarya rai bachchan wins best actress award for sarbjit

Aishwarya Rai Bachchan, Aishwarya Rai IFFAA, Aishwarya Rai Sarbjit, Sarbjit Best Actress, Aishwarya Rai International Award, Aishwarya Rai in Sarabjit, Sarabjit Best Actress, International Film Festival and Awards of Australia

Aishwarya Rai Bachchan wins best actress award for Sarbjit at the International Film Festival and Awards of Australia (IFFAA).

సరబ్ జిత్.. ఐశ్వర్య రాయ్ కు అవార్డు దక్కింది

Posted: 03/07/2017 12:47 PM IST
Aishwarya rai bachchan wins best actress award for sarbjit

కమర్షియల్ సక్సెస్ కానీ సినిమాలు క్రిటిక్స్ ప్రశంసలతో అవార్డులను కొల్లగొట్టడం సాధారణంగా జరిగేదే. గతేడాది సరబ్ జిత్ విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. ఈ సినిమాకు గానూ నటి ఐశ్వర్య రాయ్ కు ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ అవార్డ్స్ ఆఫ్ ఆస్ట్రేలియా(ఐఎఫ్ఎఫ్ఏఏ) ఉత్తమ నటిగా ఐశ్వర్య నటనకు అవార్డు దక్కింది.

రణ్ దీప్ హుడా సరబ్ జిత్ సింగ్ క్యారెక్టర్ లో కనిపించగా, అతని సోదరి పాత్ర దల్బీర్ కౌర్ గా ఐష్ చేసింది. సోదరుడి కోసం ఓ అక్క పడే ఆరాటం నేపథ్యంలో సరబ్ జిత్ బయోపిక్ తెరకెక్కించాడు దర్శకుడు ఓమంగ్ కుమార్. ఐష్ రీఎంట్రీ జాజ్బా ఫ్లాఫ్ తర్వాత వచ్చిన చిత్రం సరబ్ జిత్ పై అంచనాలు పెరిగినప్పటికీ, మిశ్రమ స్పందన లభించింది.

అయితే అందులో ఐశ్వర్య నటనకు గానూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఏది ఏమైతేనేం మొత్తానికి సరబ్ జిత్ కు అంతర్జాతీయ గుర్తింపు దక్కటంపై చిత్ర నిర్మాత జక్కీ భగ్నానీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఓమంగ్ సంజయ్ దత్, రణ్ దీప్ హుడా కాంబోలోనే భూమి అనే సినిమాను తెరకెక్కిస్తుండగా, ఓ చారిత్రక యుద్ధ కాన్సెప్ట్ నేపథ్యంలో సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai Bachchan  Sarbjit  Best Actress  IFFAA  

Other Articles

Today on Telugu Wishesh