విశాల్ వల్ల బిచ్చగాళ్లైన వాళ్ల సంగతేంటి మరి? | TNFPC president Kalaipuli S. Thanu fire on Vishal.

Kollywood producers serious on vishal comments

Hero Vishal TNFPC, TNFPC President, TNFPC versus Nadigar Sangam, Vishal Father Begging, Vishal Father GK Reddy, Vishal Producer's Council, Tamil Nadu Film Producers’ Council, Hero Vishal Comments

TNFPC president Kalaipuli S. Thanu’s move raising slogans in front of Nadigar Sangam’s office on Monday, to protest against its general secretary actor Vishal for his unsavoury comments in a magazine some time ago, caught many by surprise.Vishal has sullied the legacy of Producers’ Council Thanu added.

మళ్లీ విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి

Posted: 03/07/2017 01:21 PM IST
Kollywood producers serious on vishal comments

నడిగర్ సంఘంను గ్రాండ్ విక్టరీతో చేజిక్కిచుకున్న విశాల్ కన్ను ఇప్పుడు నిర్మాతల మండలి మీద పడిందా? రాజకీయాల్లోకి రావాలనే కోరికతో ఊగిపోతున్నాడా? ఈ ఆరోపణలు చేస్తుంది ఎవరో కాదు.. కబాలి ప్రోడ్యూసర్ కలైపులి థాను. గత కొంత కాలంగా నిర్మాతల మండలి వర్సెస్ విశాల్ గా మారిన వివాదం ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తాజా వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. అందుకు కారణం విశాల్ తన తండ్రిని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ప్రోడ్యూసర్ కౌన్సిల్ పై విరుచుకుపడటమే.

గతంలో బజ్జీలు,బోండాలు తింటూ టైంపాస్ చేస్తున్నారని కామెంట్ చేసిన విశాల్ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించాడు. నిర్మాతల సంఘం పట్టించుకోకపోవడం వల్లే సినీ నిర్మాతగా ఉన్న తన తండ్రి జీకే రెడ్డి నిరుపేదగా బిచ్చమెత్తుకునే స్థాయికి చేరుకున్నాడని విశాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అంతటితో ఆగకుండా సినిమాలు తీయని వారు కూడా నిర్మాతల సంఘం పదవి కోసం పాకులాడటం న్యాయమేనా? అంటూ ప్రశ్నించాడు. దీనిపై కౌన్సిల్ సీరియస్ అయ్యింది. నిర్మాత కలైపులి అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.


విశాల్ ను హీరోగా పెట్టి కదకళి, పట్టత్తుయానై, అంబళే, సమర్, కత్తసండై సినిమాలను తీసిన నిర్మాతలు సర్వస్వం కోల్పోయారని... ముందు వారిని కాపాడాలని సూచించాడు. విశాల్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు సైతం చాలా నష్టపోయారని ఆరోపించారు. 4000 మంది సభ్యులున్న నడిగర్ సంఘం మంచిచెడ్డలను వదిలేసి, 1500 మంది ఉన్న నిర్మాతల మండలిపై విశాల్ కన్నేశాడని, అందుకే మొండిగా ఎన్నికల్లో పోటీ పెడుతున్నాడంటూ విమర్శించాడు. మరోవైపు పలువురు సినీ నిర్మాతలు నడిగర్ సంఘం ఎదుట ధర్నా చేశారు. విశాల్ వల్ల నష్టపోయిన నిర్మాతలకు న్యాయం జరిగేలా చూడాలంటూ వారు డిమాండ్ చేయటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Vishal  Kollywood  Tamil Nadu Film Producers’ Council  Nadigar Sangam  

Other Articles

Today on Telugu Wishesh