అంత మాట అన్నా ఆర్జీవీ కూల్ గా ఎలా ఉన్నాడు? | RGV silent on Pahlaj Nihalani comments.

Rgv full confident on sarkar 3

Ram Gopal Varma, RGV Censor Board, CBFC RGV, RGV Censor Board, RGV Sarkar-3, Sarkar-3 Trailer, Pahlaj Nihalani RGV Tweets, RGV Sarkar-3 Controversy, Varma versus Censor Board, RGV CBFC, Pahlaj Nihalani Sarkar-3, Sivasena Sarkar 3

Filmmaker Ram Gopal Varma says his upcoming movie Sarkar 3 doesnt have anything that will upset the Central Board of Film Certification (CBFC) chief Pahlaj Nihalani.

సర్కార్-3 .. వర్మ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు

Posted: 03/02/2017 03:47 PM IST
Rgv full confident on sarkar 3

తన జోలికి రాకపోయినా సరే పిట్ట కూతలతో ఏ టాపిక్ ను వదలని రాంగోపాల్ వర్మ తన సినిమా విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకుంటాడా? కానీ, ఎందుకనో అలా జరగటం లేదు. సర్కార్-3 విషయంలో వితండ వాదం చేస్తున్న సెన్సార్ బోర్డు హెడ్ పహ్లజ్ నిహలాని ని మాత్రం క్షమించేస్తున్నాడు.

ఇంతకీ విషయం ఏంటంటే.. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన సర్కార్-3 వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల కానుంది. అయితే సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లక ముందే ఈ సినిమా వివాదం కాకుండా చూసుకోవాలని సీబీఎఫ్ సీ చైర్మన్ పహ్లజ్ వర్మకు సూచించాడు. అందుకు కారణం శివసేన అధినేత బాల్ థాక్రే కు సంబంధించిన కథాంశం ఆధారంగా ఇది తెరకెక్కుతుందన్న ఓ వాదన ఉండటమే.

అయితే అది నిజం కాదని వర్మ చెబుతున్నప్పటికీ ఆయన మాత్రం థాక్రే ఫ్యామిలీతో కూర్చుని మాట్లాడమని ఆర్జీవీ అడ్వైజ్ ఇస్తున్నాడు. మాములుగా ఇలాంటి వ్యవహారంలో వర్మ రియాక్షన్ వేరేలా ఉంటుంది. కానీ, ఇప్పుడు మాత్రం పహ్లజ్ పై కోపం లేదని, పైగా సినిమా సెన్సార్ నుంచి మంచి సర్టిఫికెట్ తో ఎలాంటి కట్ లు లేకుండా బయటికి వస్తుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. బిగ్ బీ సినిమా కాబట్టే ఇలా సున్నితంగా వ్యవహరిస్తున్నప్పటికీ సెన్సార్ విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం వర్మ లో అపరిచితుడు బయటికి వస్తాడని అదే ట్విట్టర్ సాక్షిగా ఛలోక్తులు పడుతున్నాయి.

ఇక వర్మ వంగవీటి లో రంగను విలన్ గా చూపటం పై తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన నటుడు జీవీ. మరో యాంగిల్ లో రంగ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రకటించాడు కూడా. అయితే ఇప్పటికే ఆ బయోపిక్ ను తెరపై చూసేసిన జనాలు మరోసారి ఇంట్రస్ట్ చూపిస్తారంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Sarkar-3  Censor Board  

Other Articles