ఫిబ్రవరి 14.. మెగా హీరో జీవితంలో విషాదం | Sai Dharam Tej About Febraury 14th.

Why mega hero not celebrating valentines day

Supreme Hero Sai Dharam Tej, Sai Dharam Tej Winner Interview, Sai Dharam Tej, Mega Hero Valentines day Tragedy, Sai Dharam Tej Valentines Day Tragedy, Sai Dharam Tej Latest Interview, Sai Dharam Tej New, Sai Dharam Tej 2017, Sai Dharam Tej Winner, Rakul Sai Dharam Tej Propose, Sai Dharam Tej Sad, Sai Dharam Tej Cry

Supreme Hero Sai Dharam Tej About Valentines day Tragedy. His Close friend was died on same date so can't celebrate that.

వాలెంటైన్స్ డే.. మెగా హీరో ఎందుకు జరుపుకోడంటే...

Posted: 02/20/2017 09:27 AM IST
Why mega hero not celebrating valentines day

ఇప్పుడున్న కుర్రహీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ కాస్త ఎక్కువే ఉంటుంది. పైకి మాస్ ఫాలోయింగ్ ఉన్న కుర్రాడిగా కనిపించినప్పటికీ సాయిధరమ్ తేజ్ కు కూడా అది తక్కువేం కాదు. కానీ, లవ్ ట్రాక్ లలో ఇరగదీసే సాయికి అమ్మాయిలంటే కాస్త మొహమాటం ఎక్కువంట. ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ విన్నర్ ప్రమోషన్ లో చెబుతోంది. అంతేకాదు సాయి కూడా తనకి వాలెంటైన్స్ డే అంటే అస్సలు ఇష్టం ఉండదని చెబుతు అందుకు ఓ బలమైన కారణం చెబుతున్నాడు.

సరిగ్గా ఫిబ్రవరి 14న తన జీవితంలో విషాదం ఉందని, అందుకే తాను ఆ రోజు చాలా విచారంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. ‘‘నేను ఏ రోజూ వేలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ రోజు నాకు బాధాకరమైన రోజే. 15 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న నా ఫ్రెండు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ రోజు చాలా విచారంగా ఉంటాను. ఆ రోజు మా స్నేహితులందరం కలుస్తాం. ఓ కాఫీ తాగి.. కాసేపు మౌనం పాటించి ఇంటికి వెళ్లిపోతాం’’ అంటూ తెలిపాడు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో రకుల్ ను తేజూకి ప్రపోజ్ చేయాలంటూ యాంకర్ కోరితే చచ్చినా ఆ పని చేయనంటూ తిరస్కరించింది. అంటే నేను నువ్వు ప్రపోజ్ చేయడానికి కూడా పనికి రానా అంటూ సుప్రీం హీరో కామెంట్ చేయటంతో అక్కడ నవ్వులు పూశాయి. అన్నట్లు మనోడికి హర్రర్ సినిమాలంటే చచ్చేంత భయమంట. దరిద్రం కాకపోతే... డబ్బులిచ్చి మరీ భయపడటం ఏంటి? జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తానన్నా అలాంటి సినిమాలు చేయను’’ అని సాయిధరమ్ తేల్చి చెప్పాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విన్నర్ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Valentines day  Tragedy  

Other Articles