ఏప్రిల్ 7.. వర్మ బర్త్ డే.. ఓ వండర్ జరగబోతోంది | Eve of RGV's birthday Sarkar 3 released.

Sarkar 3 release date announced

RGV Birthday, Sarkar-3 Release Date, Amitabh Bachchan birthday Gift to RGV, Varma Birthday Wonder, Sarkar-3 April 7, Sarkar 3 Release Date Postponed, Ram Gopal Varma Birthday, Varma Big B Movie

Amitabh Bachchan - Ram Gopal Varma's Sarkar 3 to release on April 7, 2017. On Eve of RGV's Birthday.

వర్మ బర్త్ డే గిఫ్ట్... సర్కార్-3 రిలీజ్

Posted: 02/09/2017 10:46 AM IST
Sarkar 3 release date announced

కాంట్రవర్సీ ముద్దుబిడ్డ అయిన రాంగోపాల్ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అలాగని ఏదో సెన్సేషన్ ట్వీటో, గీటో అనుకుంటే పొరపాటే. వంగవీటి ఫ్లాప్ తర్వాత నాలుగు నెలల గ్యాప్ తో వర్మ మరో సినిమా రిలీజ్ కాబోతుంది. అదే అమితాబ్ నటించిన సర్కార్-3.

సర్కార్ సిరీస్ నుంచి వస్తున్న ఈ మూడో చిత్ర ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకుంది కూడా. సుభాష్ నగ్రే గా అమితాబ్ తన నట విశ్వరూపం చూపించినట్లు అందులో తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేశారు కూడా. ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఆ రోజు మరో స్పెషాలిటీ కూడా ఉందండోయ్... అదే వర్మ పుట్టిన రోజు కూడా.

ఇంతకు ముందు ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేద్దామనుకునప్పటికీ, చివరికి ఆ డేట్ నే ఫిక్స్ చేశారు. తన ఇన్నేళ్ల కెరీర్ లో అస్సలు పుట్టినరోజు జోలికిపోని వర్మ, ఆరోజునే సర్కార్ 3 విడుదల చేయిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమితాబ్ తోపాటు, జాకీ ష్రాఫ్, మనోజ్ వాజ్ పేయి, యామీ గౌతమ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా సర్కార్ - విడుదల కానుంది. విజయ్ మాల్యాతోపాటు, అరవింద్ క్రేజీవాల్ పాత్రలపై సెటైర్లు వేస్తూ ఆయా పాత్రల పోస్టర్ లు కూడా ఆ మధ్య రిలీజ్ చేశాడు వర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Ram Gopal Varma  Sarkar-3  Release Date  April 7  

Other Articles

Today on Telugu Wishesh