జెట్ స్పీడ్ లో కాటమరాయుడు... ట్వీట్లు చేస్తుంది పవన్ కాదా? | Pawan busy with Katamarayudu Shooting.

Pawan katamarayudu shooting going on

Pawan Kalyan, Katamarayudu Shooting, Katamarayudu Climax, Pawan kalyan Katamarayudu, Katamarayudu Shooting, Katamarayudu Photos, Pawan Katamarayudu, Katamarayudu New Photos

Power Star Pawan Kalyan is currently busy balancing his political and film professions. Pawan kalyan who is raising his voice for AP Special Status and confirmed his participation at RK.Beach,Visakhapatnam on Jan 26, is currently busy shooting for his upcoming entertainer under the direction of Dolly of Gopala Gopala fame. Film’s shooting is progressing in RFC, Hyderabad and Pawan Kalyan and others are taking part in the shooting of important scenes under the direction of Dolly. It is coming out that filmmakers are planning to complete the shooting by the end of February.

కాటమరాయుడు టైం కే వస్తాడా?

Posted: 01/25/2017 03:04 PM IST
Pawan katamarayudu shooting going on

రాజకీయ ప్రభంజనం సృష్టించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న సమయంలో తమ అభిమాన హీరో సినిమా కాటమరాయుడు ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల పుకార్లకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు పవన్ కళ్యాణ్. అయితే అనుకున్న సమయానికే కాటమరాయుడు వచ్చి తీరతాడని మేకర్లు స్పష్టంగ చెప్పేశారు. ఓవైపు చకచకా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ట్వీట్లతో ప్రభుత్వాలను కడిగిపడేస్తున్నాడని అర్థమౌతోంది. అయితే తన అభిప్రాయలతో సందేశాలను ట్వీట్ల రూపంలో తెలియజేసేందుకు ఓ ప్రత్యేక విభాగంను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా గోపాల గోపాల దర్శకుడి డాలీ రూపొందిస్తున్న కాటమరాయుడు షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో ఉన్న టీం, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్లను కూడా చిత్రీకరించేసింది. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్న దుర్గా భవాని ఆలయంలో కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. ఆపై వరుసగా పాటల చిత్రీకరణ కూడా జరిపించేసి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సినిమా కంప్లీట్ చేసేయాలని భావిస్తున్నారు.

ఒకవేళ రాజకీయ కమిట్ మెంట్లతో కాస్త ఆలస్యమైనా సరే ఎట్టకేలకు మార్చి మొదటి వారం కల్లా ఎట్టిపరిస్థితుల్లో పూర్తయిపోవాలని పవన్ ఫ్లాన్ చేసుకుంటున్నాడు. వైజాగ్ ఆర్కే బీచ్ నిరసనకు మద్ధతుగా ఈ చిత్ర టీజర్ ను నిర్మాతలు పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే.శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  katamarayudu  Shoot  

Other Articles