మాస్ రాజా ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కొత్తమూవీ ఫస్ట్ లుక్ | Mass Raja come back with Touch Chesi Chudu.

Raviteja new movie first look released

Mass Raja Raviteja , Ravi Teja 2017, Raviteja New Movie, Raviteja Firstlook, Touch Chesi Chudu Movie First Look, Raviteja Touch Chesi Chudu, Touch Chesi Chudu Director, Touch Chesi Chudu Actress, Touch Chesi Chudu Producer, Touch Chesi Chudu Music Director, Touch Chesi Chudu Rashi Khanna, Touch Chesi Chudu Hero, Touch Chesi Chudu First Look, Touch Chesi Chudu Movie

Mass Raja Raviteja New Movie Touch Chesi Chudu Movie First Look. Ravi Teja's new film Touch Chesi Choodu details

రవితేజ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది

Posted: 01/25/2017 04:21 PM IST
Raviteja new movie first look released

బెంగాల్ టైగర్ హిట్ తో మాంచి జోరు మీదున్న ఆ తర్వాత రెండు వరుస సినిమాలు కమిట్ అయ్యి ఎలాగైతే వార్తల్లో నిలిచాడో.. రెమ్యునరేషన్ మూలంగా వాటిని వదలుకుని అంతే జెట్ స్పీట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇక ఈ మాస్ మహరాజా సినిమా వచ్చి ఏడాది పైగానే దాటిపోయింది. దీంతో ఫ్యాన్స్ కాస్త ఫీలయ్యారు. అయితే ఈ ఏడాది మాత్రం వరుసపెట్టి సినిమాలు చేయాలనుకుంటున్న రవితేజ తన తాజా ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

విక్రమ్ సిరికొండ అనే దర్శకుడితో నల్లమల్లపు శ్రీనివాస్(బుజ్జి) తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. అదే టచ్ చేసి చూడు. అల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు వచ్చేసింది. రేపు అంటే జనవరి 26 మాస్ రాజా పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను వదిలాడు. మొత్తానికి ప్రపంచ టూర్ తో హ్యాపీగా ఉన్న మాస్ రాజా కూల్ లుక్ తో కొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు. చూస్తుంటే తన ఫంక్తూ సినిమాతో మరోసారి రాబోతున్నట్లు అర్థమౌతోంది.

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుండగా, రాశీఖన్నా హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక ఇదేగాక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎవడో ఒకడు, చక్రి అనే దర్శకుడితో రాబిన్ హుడ్, బాబీతో ఓ ప్రాజెక్ట్, విక్రమ్-దీపక్ జంట దర్శకులతో ఓ పోలీస్ స్టోరీ ఇవి కూడా నెక్ట్స్ ప్రాజెక్టులుగా అల్రెడీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ యేడాది కనీసం రెండు ప్రాజెక్టులతో అభిమానులను ఆకట్టుకోవాలన్నదే మాస్ రాజా మాస్టర్ ఫ్లాన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Touch Chesi Chudu  Movie  Raviteja  

Other Articles

Today on Telugu Wishesh