బోల్డ్ స్టేట్ మెంట్: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ సెక్స్.. షవర్ రొమాన్స్. | Priyanka about phone sex and shower romance.

Steamy confessions of priyanka chopra in koffee with karan 5

Actress Priyanka Chopra, Coffee With Karan Show, Koffee With Karan 5, PC in Koffee With Karan 5, Priyanka Chopra Phone Sex, Tom Hiddleston Priyanka Chopra, Priyanka Chopra Karan Johar, Priyanka shower romance, Priyanka Chopra about Ex boyfriend

Actress Priyanka Chopra's revelations in Coffee With Karan Show season 5 about relationships, engaging in phone sex, Tom Hiddleston affair, Hollywood and Bollywood Life, kissing an ex and having phone sex.

కరణ్ షోలో ప్రియాంక బాగా ఓపెన్ అయిపోయింది

Posted: 01/23/2017 11:01 AM IST
Steamy confessions of priyanka chopra in koffee with karan 5

సెలబ్రిటీల పర్సనల్ బాగోతాలను బయటపెట్టే కాఫీ విత్‌ కరణ్ షో మరోసారి వార్తల్లో ఎక్కేసింది. మాజీ విశ్వసుందరి, నటి ప్రియాంక చోప్రాతో నిర్మాత కరణ్ జోహర్ జరిపిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక తెగించి మరీ పచ్చి నిజాలు చెప్పి అందరినీ షాక్ కి గురిచేసింది. ఇప్పటికే గత నాలుగు సీజన్ లో హాజరైన ప్రియాంక ఇప్పుడు 5వ దానికి కూడా హాజరై సరికొత్త రికార్డును నెలకొల్పటమే కాదు, తన వ్యక్తిగత విషయాలపైన కూడా స్పందించింది.

అమెరికా టీవీ షో క్వాంటికోలో ఎబీఐ ఏజెంట్ అలెక్స్ పార్రీష్ పాత్రలో ప్రియాంక పాపులర్ అయిన విషయం తెలసిందే. ఇందుకుగానూ ఈ మధ్యే ప్రతిష్టాత్మక అవార్డు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో కరణ్ తన షోకి ఆహ్వానించగా, ఇంతకు ముందు వాళ్లకంటే బోల్డ్ సమాధానాలనే ప్రియాంక ఇచ్చింది.రాఫిడ్ ఫైర్ రౌండ్ లో కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలనే అడిగే కరణ్ ఎప్పటిలాగే ప్రియాంకను అలాంటివే అడిగాడు.

ముందుగా పర్సనల్ వ్యవహారాలంటూ హాలీవుడ్ స్టార్ టామ్ హిడ్డిలెస్ టన్ అఫైర్ గురించి ప్రస్తావించగా, తాను ఆయన్ని కేవలం 10 నిమిషాలు మాత్రమే కలిసి మాట్లాడానని, ఆ మాత్రానికే రిలేషన్ అంటగట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించింది. ఆపై సెక్స్ గురించి అడగ్గా, తాను కేవలం ఫోన్‌ సెక్స్‌ మాత్రమే చేసేదాన్నని ప్రియాంక రివీల్‌ చేసింది. అంతేకాదు మాజీ ప్రియుడిని కిస్ చేశానని చెప్పిన ఆమె, ఇద్దరూ కలిసి షవర్ కింద స్నానం చేస్తూ ఎంజాయ్ చేశామని కూడా చెప్పింది.

అంతేనా చివర్లో తన ట్విట్టర్ లో తన హేటర్స్ గురించి ఏమైనా చెబుతావా? అంటే... ఎఫ్, ఎస్ (F***, S***) అండ్ గెట్ లాస్ట్ అంటూ బండ బూతులు చెప్పి షోని ముగించింది. ఎప్పుడూ ఇద్దరేసి సెలబ్రిటీలతో కార్యక్రమం కానిచ్చే కరణ్ ఈసారి మాత్రం సోలోగా ప్రియాంకతోనే(పర్సనల్ యవ్వారాలతో) కావాల్సినంత టీఆర్పీని రాబట్టేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Actress Priyanka Chopra  Coffee With Karan 5  surprising revelations  

Other Articles