మన హీరోలకు చాతకాదా? .. నపుంసకుల్లా మారిపోయారంటు కామెంట్లు... | SP Balu fire on Star Heroes and Fans.

Sp balu sensational comments on tollywood

SP Balu, Senior Singer SP Balasubramaniam, Balu Comments, SP Balu comments on Heroes, SP Balu Star Heroes, SP Balu fire, Singer Balasubramaniam, SP Balu Tollywood

Senior Singer SP Balasubramaniam sensational comments on Star Heroes and their fans.

పనికిమాలిన సినిమాలు ఇంకెంత కాలం?

Posted: 01/23/2017 09:09 AM IST
Sp balu sensational comments on tollywood

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కామెంట్స్ తో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర కలకలమే రేగింది. స్టార్ హీరోలను, అభిమానులను టార్గెట్ చేసి ఆయన తీవ్ర స్థాయి పదజాలంతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం కళారంగం జాతులు, కులాలు, వర్గాలు ఆధిపత్య పోరుతో చండాలంగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలే చేశాడు. కేవలం ఫ్యాన్స్‌ మాత్రమే సినిమాలను చూస్తే కలెక్షన్లు రావని, అందరు అన్ని సినిమాలను ఆదరిం చాలని కోరారు. 50 ఏళ్ల నుంచి తాను 15 భాషల్లో పాటలు పాడుతున్నానని, ఇన్నేళ్లలో గమనించిన అంశం ఏంటంటే... భాషపై అంకితభావం లేనివారు తెలుగువారేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సినిమా స్థాయిని ప్రజలే నిర్ణయించాల్సి ఉందంటున్నాడు.

‘‘లబ్దప్రతిష్టులయిన హీరోలు తెలుగు జాతి కోసం భాష గర్వపడేలా ఒక్క సినిమా తేయలేరా? ఎంత సేపూ కేరళ కర్ణాటక వాళ్లకు అవార్డులు వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారే కానీ.. ఎంత మంది తమ అభిమాన ఆర్టిస్టులను దేశం గర్వించే సినిమాలు తీస్తారా? అని ప్రశ్నించగలుగుతున్నారా? ‘దంగల్’ సినిమాను ఆమిర్ ఖాన్ ఒక్కడే చేయగలడా? మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు.. అభిమాని ఆత్మ విమర్శ చేసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను సైతం విస్మరిస్తూ చిత్రాలు రావడం దురదృష్టకరమ ని చెప్పారు.

ఇక సినీ ప్రేక్షకుల పరిస్థితి సంకెళ్లు వేసుకున్న నపుంసకుల్లా మారిపోయింది. సినిమాల్లో నచ్చని అంశంపై నోరెత్తితే ఏ అభిమానులు వచ్చి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపిస్తారోనని భయపడాల్సి వస్తోంది. తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే అభిమానులు.. సోకాల్డ్ ఫ్యాన్స్.. ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించరు? ఈ అభిమానులు తమ ఆర్టిస్టులను ప్రశ్నించగలిగిన రోజే జాతి గర్వించదగ్గ సినిమాలు వస్తాయి. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలి. హీరోలు కనీసం ఒక్క సినిమా అయినా జాతి భాష కోసం చేయాలని పిలుపునిచ్చాడు. ఓ కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కా రం అందుకున్న ఆయన పై వ్యాఖ్యలు చేశాడు.

 

కోలీవుడ్ ను చూసైనా కదలరేం-చలసాని

జ‌ల్లిక‌ట్టు క్రీడ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ త‌మిళ‌నాడులో అగ్ర‌ సినీన‌టులు మొన్న జ‌రిగిన ఆందోళ‌న‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆ స్ఫూర్తితో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రత్యేకహోదా కోసం సినీపరిశ్రమ మద్దతు తెలపాలని ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత‌ చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చాడు. తెలుగు సినీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలను రాజకీయంగా, సినిమాల పరంగా ప్రజలు ఆదరించారని.. కానీ, స‌ద‌రు హీరోలు మాత్రం రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Chalasani Chiru and Balayya

తమిళ సినీ నటులు ప్రజలకు అండ‌గా నిల‌బ‌డి పోరాడుతుంటే తెలుగు హీరోలు మాత్రం సినిమాలతో కోట్లు కొల్లగొట్టుకుపోతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్య‌మానికి ముందుకు రావాలని ఆయ‌న అన్నారు. కేంద్ర స‌ర్కారు రాష్ట్రానికి ఇచ్చే ముష్టిని మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటోందంటూ తీవ్ర విమర్శలకు దిగాడు. కాగా,  ట్విట్టర్ ద్వారా పోలవరం మీద వరుస ట్వీట్లు చేసిన ఆయన.. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ సాధన కోసం స్పందించాడు. రాజీ లేదు.. ఇక రణమే...

జల్లికట్టుపై పక్కనున్నతమిళనాడులో అక్కడి యూత్ మెరీనా బీచ్ దగ్గర చేసిన శాంతియుత నిరసన తెలుపుతున్న విషయం విదితమే. సోషల్ మీడియాతో జరిగిన ప్రచారంతో కేవలం 200 మంది మెరీనా బీచ్ దగ్గర మొదలెట్టిన నిరసన ఎంత పెద్దదిగా సాగి.. చివరకు కేంద్రం ఈ అంశంపై హుటాహుటిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో సైలెంట్ ప్రొటెస్ట్ (నిశ్శబ్ద నిరసన)కు ప్లాన్ చేసుకున్న పక్షంలో జనసేన వారికి మద్దతు ఇస్తుందన్న విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం దేశ్ బచావ్ పేరిట మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించిన జనసేన ఫిబ్రవరి మొదటి వారంలో దానిని విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే దానిని ఈనెల 24నే విడుదల చేయనున్నట్లు పవన్ తెలిపాడు. సమకాలీన రాజకీయాలు ఎంత నేర ప్రవృత్తితో కూడుకుని ఉంటున్నాయో, అవకాశవాద నేతల తీరును ఎండగడుతూ ఏపీ హోదా అంశాన్ని అందులో హైలెట్ చేశారంట.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer  SP Balasubramaniam  Tollywood  Comments  

Other Articles