బాహుబలి నిజంగా చెత్త.. మరి శాతకర్ణి మాటేంటో? | Actress Jamuna praises Satakarni movie.

Veteran actress jamuna impress with gautamiputra satakarni

Actress Jamuna, Gautamiputra Satakarni, Jamuna kiss Balayya, Jamuna on Baahubali, Jamuna Satakarni, Jamuna praise Bala Krishna, Bala krishna Jamuna, Jamuna Satakarni

Veteran Actress Jamuna praises Gautamiputra Satakarni Movie team. She also Kissed Balayya.

శాతకర్ణి చూసి ఎగ్జయిట్ అయిన సీనియర్ నటి

Posted: 01/17/2017 03:19 PM IST
Veteran actress jamuna impress with gautamiputra satakarni

హిట్ టాక్ ను తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకెళుతున్న చారిత్రక చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని మరింతగా ఉదృతంగా ప్రమోట్ చేసేందుకు క్రిష్ టీం ముందుకు సాగుతోంది. ఈ దశలోనే దర్శకధీరుడు రాజమౌళి, హీరో రానాల ఇంటర్వ్యూలు స్పెషల్ హైలెట్ గా మారనున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులంతా ఇప్పటికే శాతకర్ణిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ నటి చేసిన కామెంట్లను ఇప్పుడు చూద్దాం.

అలాగని ఆవిడ ఏం నెగటివ్ కామెంట్లు చేయలేదండి. ఏడాదిన్నర క్రితం బాహుబలి రిలీజ్ అయిన సమయంలో అదో చెత్త సినిమా అంటూ కామెంట్ చేసిన నటి జమున శాతకర్ణి కూడా చూసిందంట. మరి దాని ఫీడ్ బ్యాక్ కూడా ఇచ్చేస్తోంది. అయితే శాతకర్ణి మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందంట. బాలయ్య, క్రిష్, నిర్మాతల సమిష్టికృషే ఈ చిత్రం అంటూ ఆవిడ ప్రశంసలు కురిపించింది.

శాతకర్ణిగా బాలయ్య నటన అద్భుతంగా ఉందని, చరిత్రను పక్కదోవ పట్టించకుండా క్రిష్ కూడా దర్శకత్వం బాగా డీల్ చేశాడని, చిత్రం కోసం వేసిన సెట్లు చాలా నేచురల్ గా ఉన్నాయంటూ శాతకర్ణి యూనిట్ ఆకాశానికెత్తేసింది. అక్కడితోనే ఆమె ఆగలేదు పక్కనే ఉన్న బాలయ్య నుదుటి మీద ఓ ముద్దు కూడా పెట్టేసి తన ప్రేమను ప్రదర్శించింది ఆమె.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  Satakarni Movie  veteran Actress Jamuna  Impress  

Other Articles