అమీర్ కూతురు.. అనవసర వివాదం | Zaira Wasim apology for meet Mehbooba Mufti.

Dangal zaira wasim issues apology after being trolled

Dangal Movie, Actress Zaira Wasim, Mehbooba Mufti, Aamir Khan supports Zaira Wasim, Zaira Wasim Controversy, Zaira Wasim apology, Zaira Wasim with Mehbooba Mufti, Omar supports Zaira Wasim

Dangal actress Zaira Wasim issues apology after being trolled for meeting J&K CM Mehbooba Mufti.

కశ్మీర్ దంగల్: జైరా సారీ చెప్పినా వదలట్లేదే!

Posted: 01/17/2017 12:56 PM IST
Dangal zaira wasim issues apology after being trolled

కూతురంటే అమీర్ ఖాన్ సొంత కూతురు కాదులేండి. 'దంగల్'లో రెజ్లర్ అమీర్ కూతురిగా, గీతా ఫొగాట్ చిన్ననాటి పాత్రలో నటించిన జైరా వసీం. 16 ఏళ్ల ఈ అమ్మాయి కశ్మీరీ యువతకు క్షమాపణలు చెప్పింది. అసలు విషయం ఏంటంటే... సినిమా విజయం సాధించిన నేపథ్యంలో, కశ్మీరీ బాలిక అయిన జైరా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసింది. అంతే సమావేశంపై కశ్మీరీ యువత తీవ్రంగా స్పందించింది. ఓవైపు కశ్మీరీ యువతపై దాడులు జరుగుతుంటే... సీఎంను జైరా కలవడం ఏంటంటూ ఫేస్ బుక్ లో ఆ బాలికపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తాను కొందరిని కలవడం చాలా మందిని బాధించిందని... వారందరికీ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని జైరా తెలిపింది. కశ్మీర్ లో గత ఆరు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పింది. అయితే తనను విమర్శించిన వారు కూడా తనను అర్థం చేసుకోవాలని... అన్ని పరిస్థితులను తాను నియంత్రించలేనని... తాను కేవలం 16 ఏళ్ల బాలిక అనే విషయాన్ని అర్థం చేసుకుని, తన పట్ల వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది.

Zaira meet Jammu CM

ఇదిలా ఉంటే జైరా వసీంకు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతుగా నిలిచాడు. సోషల్ మీడియాలో జైరాపై కశ్మీరీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. జైరా ఒక 16 ఏళ్ల బాలిక అని... ముఖ్యమంత్రి ముఫ్తీని కలిసిందనే కారణంతో ఆమె క్షమాపణలు చెప్పాలని బలవంతం చేయడం భావ్యం కాదని ఒమర్ అన్నారు. కశ్మీరీ యువతకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం జైరాకు ఎంతమాత్రం లేదని చెప్పారు.

మరోవైపు జమ్ముకశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ రైనా ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ, జైరాను దేశ వ్యతిరేక శక్తులు బెదిరిస్తున్నాయని... ఆమెకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నజీర్ అహ్మద్ స్పందిస్తూ, రవీందర్ సూచనను పరిశీలించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు చిత్ర హీరో అమీర్ ఖాన్ కూడా బాలికకు మద్ధతుగా నిలిచాడు. జైరా నీ వెంట మేమంతా ఉన్నాం. నువ్వు నిజంగానే రోల్ మోడల్ వి అంటూ అమీర్ ధైర్యం చెప్పే యత్నం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangal Movie  Zaira Wasim  CM Mehbooba Mufti  

Other Articles