సెన్సార్ రిపోర్ట్చె... ప్పిదంతా నిజమేనా? | Gautamiputra Satakarni Completes Censor.

Gauthamiputra satakarni cleared by censor board

Gautamiputra Satakarni, Satakarni Censor, Satakarni story details, Satakarni run time, Satakarni censor report, Satakarni U/A

Gautamiputra Satakarni Movie Censored with U/A Certificate With Out Any Cuts.

శాతకర్ణి యూ బై ఏ.. నో కట్స్

Posted: 01/06/2017 08:41 AM IST
Gauthamiputra satakarni cleared by censor board

టాలీవుడ్ నటసింహ బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. విశేషం ఏంటంటే... ఒక్కటంటే ఒక్క కట్ లేకుండా క్లియరెన్స్ ఇచ్చారంట.

సినిమాను చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపినట్లుగా చెబుతున్నారు. 2 గంటల 15 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో భారీ ఎత్తున తెర కెక్కించిన యుద్ధసన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి తెలుగువాడి దృష్టిని ఆకర్షించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆ మాటల్లో నిజం ఎంతన్నది తేలటానికి మరో వారం మాత్రమే మిగిలి ఉంది.

ఈ నెల 12న భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి సత్తా చాటడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ చిత్రంలో హేమమాలిని, శ్రియ, కబీర్ ఖాన్ తదితర నటులు నటించారు. ఇక సినిమా రిలీజ్ పై అభిమానులు చేస్తున్న గొడవ తారా స్థాయికి చేరింది. క్రిష్ ఇంటి ముందు అభిమానులు ధర్నా చేయటంతో చర్చిద్దాం అంటూ సర్ది చెప్పి పంపటంతో ఏం జరగబోతుందా అన్న ఆసక్తి నెలకొంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Censor  U/A  

Other Articles