కొత్త సినిమా మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ | Pawan Trivikram third film launched

Pawan trivikram third film launched

Pawan Kalyan's new movie with Trivikram Srinivas, Pawan kalyan movies in 2016, Pawan Kalyan's new movie, Pawan Trivikram New Movie, Pawan next movie launched, Pawan Trivikram third movie, pawan with Radhakrishna

Pawan Kalyan's new movie with Trivikram Srinivas launched.

పవన్-త్రివిక్రమ్ మూవీ లాంఛ్

Posted: 11/05/2016 01:35 PM IST
Pawan trivikram third film launched

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి మాటల మాంత్రికుడితో కలిసి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జల్సా, అత్తారింటికి దారేది ట్రెండ్స్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ముచ్చటగా మూడో సారి వీరిద్దరు కలిసి మరోసారి సందడి చేయబోతున్నారు.

ఈ చిత్రం కాసేపటి క్రితం అధికారికంగా రామానాయుడు స్టూడియోలో చిత్రం లాంఛ్ అయ్యింది. కొద్ది మంది మధ్య జరిగిన పూజా కారక్రమాలతో ఈ సినిమా ప్రారంభించినట్లు సంకేతాలు పంపించారు. ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమా చేస్తోన్న పవన్ డిసెంబర్ కల్లా షూటింగ్ అయిపోగొట్టేసి త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవుతాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిచనుండగా, పవన్ మూవీతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు . హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ప్రొడక్షన్ నెం.4 చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వేదళమ్ రీమేక్‌గా ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఆర్.టీ.నేసన్ దర్శకత్వం వహించనుండగా, ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే ముందుగా త్రివిక్రమ్ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వటంతో దీనినే పూర్తిచేయాలని పవన్ భావిస్తున్నాడంట. దేవుడే దిగి వచ్చినా... అనే టైటిల్ పరిశీలనలో ఉందని, కుష్బూ ఓ కీ రోల్ చేస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ, దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

pawan trivikram new movie launched

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Trivikram Srinivas  Third movie  launched  

Other Articles