పోసాని లేని టైంలో ఇంటికి వెళ్లిన దర్శకుడెవరు | Posani Krishna Murali fires on Director Boyapati

Posani krishna murali fires on director boyapati

Posani Krishna Murali fires on Boyapati, Posani fires on Boyapati, Posani wife Boyapati, Boyapati counter to Posani

Posani Krishna Murali fires on Director Boyapati Srinu.

పోసాని భార్యతో బోయపాటి అలా మాట్లాడాడా?

Posted: 10/17/2016 12:46 PM IST
Posani krishna murali fires on director boyapati

ముక్కుసూటిగా మాట్లాడే పోసాని కృష్ణమురళి మరోసారి విశ్వరూపం చూపించాడు. స్టార్ దర్శకుడు బోయపాటి శీను పై దారుణంగా ఫైరయ్యాడు. విశ్వాసం లేని వ్యక్తి అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఓవైపు బిడ్డలాంటోడు అంటూనే, తన విషయంలో తప్పుడుగా ప్రవర్తించాడంటూ విరుచుకుపడ్డాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన శీనును ముత్యల సుబ్బయ్య దగ్గర అసిస్టెంట్ గా పెట్టింది తానేనంటూ చెప్పిన పోసాని పలు ఆసక్తికర విషయాలను ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

తన వద్ద 35 మంది వరకు అసిస్టెంట్లుగా పని చేసేవారని, వారంతా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగిలిన వారంతా తనపట్ల కృతజ్ఞతగా ఉన్నారని ఆయన తెలిపారు. తిండికి గతిలేని పరిస్థితుల్లో అతనిని తీసుకొచ్చి మంచి దర్శకుడి వద్ద పెట్టానని ఆయన అన్నారు. తన భార్య ఆసుపత్రిలో ఉందని, డబ్బుల్లేవని బోయపాటి ఏడ్చినప్పుడు ఆమె ఆసుపత్రి బిల్లు మొత్తం తన భార్య భారించిందని, తాను తన ఓపెల్ ఆస్ట్రో కారిచ్చి ఆమెను ఆసుపత్రికి పంపించానని ఆయన గుర్తుచేసుకున్నారు.

అలాంటి శ్రావణ మాసం సినిమా ఫ్లాప్ అయ్యాక బోయపాటి ఓ రోజు తన భార్య దగ్గరికి వెళ్లి తనకు(పోసానికి) దర్శకత్వంలో అనుభవం లేకనే ఇలా జరిగిందని చెప్పాడని, ఆ మాటకు తన భార్య చాలా బాధపడిందని చెప్పుకోచ్చాడు. అయినా బోయపాటి కూడా తన కుమారుడిలాంటివాడేనని, ఆ గర్వం లేకపోయి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వంద సినిమాలకు మాటల రచయితగా, దర్శకుడిగా నిరూపించుకున్నానని ఆయన చెప్పారు. తనలో ఫైర్ అలాగే ఉందని ఆయన అన్నారు. గొప్ప రచయితలు శ్రీశ్రీ, ఆత్రేయలు ఎలా మరణించారో తనకు తెలుసని ఆయన అన్నారు. రచయితగానో లేదా ఇంకొకరిగానే చావాలని లేదని, పోసానిగా ఉండడమే తనకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani krishna Murali  Boyapati Srinu  controversary  

Other Articles

Today on Telugu Wishesh