పవన్ కల్యాన్ కొత్త సినిమా ప్రారంభం Pawan Kalyan's new movie with RT Nesan takes off

Pawan kalyan s new movie with rt nesan takes off

pawan kalyan,Pawan Kalyan next film,director rt nesan,rt nesan new movie,am rathnam,pawan kalyan rt nesan,producer rt nesan

Pawan Kalyan's latest Telugu movie has been launched on the auspicious day of Vijayadashami. The upcoming movie is said to be the remake of hit Tamil movie Vedalam.

పవన్ కల్యాన్ కొత్త సినిమా ప్రారంభం

Posted: 10/11/2016 12:54 PM IST
Pawan kalyan s new movie with rt nesan takes off

విజయదశమి పండగా పర్వదినం రోజున తలపెట్టిన ఏ కార్యమైన దిగ్విజయంగా విజయవంతం అవుతుందని ఈ ముహుర్తాన్ని ఎంచుకుని అనేక మంది అనేక కార్యక్రమాలు చేపట్టడం అనవాయితి. ఈ అనవాయితి జాబితాలోకి తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాన్ కూడా చేరారు. ఆయన హీరోగా నటించనున్న కొత్త సినిమా ఇవాళ ప్రారంభమైంది. తమిళంలో అజిత్, శ్రుతిహాసన్ జంటగా నటించిన వేదలం సినిమాకు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. సినిమా ప్రారంభోత్సవం చాలా సింపుల్‌గా జరిగింది.

హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు నేశన్, నిర్మాత ఏఎం రత్నం మాత్రమే ఇందులో పాల్గొన్నారని సినిమా వర్గాలు తెలిపాయి. గతంలో జిల్లా సినిమా తీసి మంచి విజయం సాధించిన నేశన్.. ఇప్పుడు తెలుగులో పవన్‌తోనే ఆరంగేట్రం చేస్తున్నాడు. కాగా, పవన్ ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్‌లే. అజిత్ ఇంతకుముందు తీసిన వీరం రీమేక్‌గా కాటమరాయుడు చేస్తున్నాడు. దీనికి ఎస్‌జె సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వేదలం రీమేక్‌ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  new movie  vedalam remake  A.M Ratnam  Nesan  tollywood  

Other Articles