దేవుడే దిగి వచ్చినా... రియల్ స్టోరీనా? | pawan trivikram Devude Digivochina 100 crores budget

Pawan trivikram devude digivochina 100 crores budget

pawan trivikram Devude Digivochina, Devude Digivochina telugu movie, Devude Digivochina Budget, Pawan kalyan 100 cores movie, pawan trivikram Devude Digivochina

pawan trivikram Devude Digivochina 100 crores budget movie.

పవర్ స్టార్ కెరీర్ లోనే తొలిసారిగా....

Posted: 10/03/2016 05:50 PM IST
Pawan trivikram devude digivochina 100 crores budget

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో మన ముందుకు రాబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ కాటమరాయుడు షూటింగ్ దశలో మీద ఉండగానే డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ డైరక్షన్ లో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. వెరసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో డాలీ సినిమా, ఆపై ద్వితీయార్థంలో త్రివిక్రమ్ సినిమా విడుదల కానున్నాయి. అయితే క్రేజీ కాంబినేషన్ గా పేరున్న మాటల మాంత్రికుడి సినిమా మరో ప్రత్యేకతను సంతరించుకోబోతుంది.

తాజా సమాచారం ప్రకారం పవన్ అభిమానులు కోరుకునే విధంగా కాస్త పొలిటికల్ టచ్ తోపాటు, తన సినిమాల్లో మాములుగా కనిపించే ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అంశాలను మేళవించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను తయారు చేశాడంట. అల్రెడీ స్టోరీ లైన్ విన్న పవన్, ఇప్పుడు తెచ్చిన స్క్రిప్ట్ కూడా నచ్చటంతో దానిని మరింత డెవలప్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ‘దేవుడే దిగివచ్చినా’ (టైటిల్ ప్రచారంలో ఉంది)  ప్రాజెక్టు భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ  నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారంట. డిసెంబర్ ముందు తేదీ అనుకుంటున్నప్పటికీ, ప్రస్తుతం కాటమరాయుడు షూటింగ్ 70 పైగా అయిపోతే మాత్రం నవంబర్ నుంచే సినిమా షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని సంకేతాలు అందుతున్నాయి. ఏదైతేనేం మరోసారి మాటల మాంత్రికుడితో మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Trivikram  devude Digivochina  100 Crores Movie  

Other Articles