మహేష్-త్రివిక్రమ్ మరోకటి ఫిక్స్ | Mahesh Babu under Trivikram again

Mahesh ad direction in trivikram

Mahesh Babu Triivikram, mahesh Trivikram Ad, Mahesh Trivikram did it again, Mahesh Babu Triivikram third movie

Mahesh Babu Ad under Trivikram Direction.

త్రివిక్రమ్ డైరక్షన్ లో మహేష్ అక్టోబర్ నుంచి...

Posted: 09/28/2016 10:48 AM IST
Mahesh ad direction in trivikram

టాలీవుడ్ టాప్ హీరోలు పవన్, మహేష్ లతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి అవినాభావ సంబంధం ఉంది. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా వారిద్దరితో మంచి సంబంధాలు మెయింటెన్ చేస్తుంటాడు త్రివిక్రమ్. పవన్ తో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చి డిసెంబర్ నుంచి మూడో చిత్రానికి సిద్ధమైపోతున్నాడు. ఇంతలో త్రివిక్రమ్ మహేష్ ను డైరక్ట్ చేయబోతున్నానే వార్త బయటికి వచ్చింది.

గతంలో ప్రిన్స్ తో కలిసి అతడు.. ఖలేజాలు తీశాడు. అంతే కాదు కొన్ని కమర్షియల్ యాడ్ లను కూడా డైరెక్ట్ చేశాడు. అలాగే మరో కమర్షియల్ అడ్వర్టైజ్ మెంట్ కి ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి పనిచేయనున్నారు. మహేశ్ ఒక ఆన్ లైన్ టికెటింగ్ సంస్థతో అడ్వర్టైజింగ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ సంస్థ ప్రతినిధులు యాడ్ చేయవలసిందిగా త్రివిక్రమ్ ను సంప్రదించడంతో, అందుకు ఆయన అంగీకరించాడు.

అక్టోబర్ మొదటివారంలో ఈ యాడ్ షూటింగ్ వుంటుందట. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ఈ షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక పవన్ తో సినిమా తర్వాత మహేష్ 25వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Trivikram  Advertisement  Shoot  

Other Articles