గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య, శ్రీయా మరియు హేమామాలిని లుక్స్ విడుదల | balayya shriya and hema malini looks from GSP out

Balayya shriya and hema malini looks from gsp out

Gautamiputra Satakarni balayya look, Gautamiputra Satakarni shriya look, Gautamiputra Satakarni Hema Malini look, Gautamiputra Satakarni cast looks, Gautamiputra Satakarni first look, Gautamiputra Satakarni, balayya shriya and hema malini looks, Gautamiputra Satakarni new posters, Gautamiputra Satakarni Madhya Pradesh schedule

balayya shriya and hema malini looks from Gautamiputra Satakarni out.

శాతకర్ణి లుక్స్ బయటికెలా వచ్చాయి?

Posted: 09/01/2016 12:40 PM IST
Balayya shriya and hema malini looks from gsp out

నట సింహ బాలకృష్ణ కెరీర్ లోనే తొలిసారి భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది గౌతమీపుత్ర శాతకర్ణి. వందో చిత్రం, పైగా చారిత్రక నేపథ్యం కావటంతో అన్ని పనులు దగ్గరుండీ మరి చూస్కుంటున్నాడు బాలయ్య. తాజాగా నెలరోజుల తర్వాత కొత్త షెడ్యూల్ ప్రారంభించిన టీం మధ్యప్రదేశ్ లో కోటల్లో రాజమహల్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

ఇప్పటిదాకా బాలయ్య కింగ్ గెటప్ లో పూర్తిస్థాయి స్టిల్స్ బయటికి రాలేదనే చెప్పాలి. కానీ, ఇంతలో శాతకర్ణి స్టిల్స్ కొన్ని నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజు గెటప్ లో రాజసం ఉట్టిపడుతున్న గెటప్ లో బాలకృష్ణ కనిపిస్తుండగా, రాజమాతగా హేమామాలిని, శాతకర్ణి(బాలయ్య) భార్యగా యాక్ట్ చేస్తున్న శ్రేయా సరన్ లు ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. వీరిద్దరు ఈ మద్యే షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. పసి పిల్లాడిని ఎత్తుకున్న శ్రియ.. పక్కనే గంభీరంగా కనిపిస్తున్న హేమమాలిని లుక్స్ లో పెద్ద అట్రాక్షన్ లేకపోయినా టేకింగ్ విషయంలో మాత్రం క్రిష్ మంచి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు.

బాహుబలి లాంటి సినిమా కోసం గ్రాఫిక్స్ కోటలను వాడితే, శాతకర్ణి కోసం నిజమైన కోటల్లోనే షూటింగ్ కానిచ్చేస్తున్నాడు క్రిష్. అయితే సినిమా స్టిల్స్ తాము విడుదల చేయలేదని చిత్ర యూనిట్ చెబుతూ, మరోవైపు ఈ లీక్ వీరులెవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బాలయ్య ఫస్ట్ లుక్ తో ఓ టీజర్ త్వరలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న టైంలోనే ఈ ఫోటోలు బయటికి రావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Balayya  Shiya Saran  Hema Malini  

Other Articles

Today on Telugu Wishesh