యే దిల్ హై ముష్కిల్ టీజర్ విడుదల | Ae Dil Hai Mushkil teaser released

Ae dil hai mushkil teaser released

Ae Dil Hai Mushkil teaser, Ranbir and Aishwarya Rai, Ranbir Kapoor and Aishwarya Rai Bachchan romance, Ae Dil Hai Mushkil tri angle love, Ae Dil Hai Mushkil title song, Ae Dil Hai Mushkil dialogues, Ae Dil Hai Mushkil romance, Ae Dil Hai Mushkil story, Ae Dil Hai Mushkil first look, Ae Dil Hai Mushkil cast and crew, Karan Johar Ae Dil Hai Mushkil, Fawad Khan Ae Dil Hai Mushkil

Karan Johar released Ae Dil Hai Mushkil teaser. Ranbir Kapoor and Aishwarya Rai Bachchan share a sizzling chemistry.

టీజర్: ముక్కోణ ప్రేమకథగా యే దిల్ హై ముష్కిల్

Posted: 08/30/2016 01:25 PM IST
Ae dil hai mushkil teaser released

ట్రయాంగిల్ ప్రేమకథలను అద్భుతంగా ఆవిష్కరించడంలో దిట్ట అయిన కరణ్ జోహార్ అప్ కమింగ్ ఏ దిల్ హై ముష్కిల్ టీజర్ వచ్చేసింది. రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా, మాజీ విశ్వసుందరి ఐశ్వర రాయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. వ‌న్‌సైడ్ ల‌వ్‌.. డీప్ ఫ్రెండ్‌షిప్‌.. హార్ట్‌బ్రేక్‌. ఇదీ యే దిల్ హై ముష్కిల్‌ కాన్సెప్ట్. ఇదోక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్లు అర్థమౌతోంది.

ఇంతకు ముందే ముక్కూ ముక్కూ రాసుకుంటున్న రణబీర్, ఐశ్వర్య ల పోస్టర్లను రిలీజ్ చేసిన కరణ్ ఇప్పుడు టీజర్ లో పూర్తి స్థాయి రొమాన్స్ ను చూపించాడు. టైటిల్ ట్రాక్ తో పాటు రిలీజైన ఈ వీడియోలో రణ్ బీర్ ప్రేయసిగా అనుష్క శర్మ, మరో లవ్ ఇంట్రెస్ట్ గా ఐష్ లను చూపించాడు. పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ కూడా ఈ ఫిల్మ్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ లతో ప్రేమ కథలోని సున్నితత్వాన్ని చూపే కరణ్ డైరక్షన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఐశ్వర్య పాత్ర గనక పరిశీలిస్తే అల్రెడీ పెళ్లయిన మహిళగా అనిపిస్తోంది. ప్యార్ కే తాక‌త్ హీ కుచ్ ఔర్ హోతీ హై అన్న డైలాగ్ తో చూస్తుంటే గతంలో కరణ్ తీసిన కబీ అల్విదా నా కెహనా టైపు ఇల్లీగల్ అఫైర్ కాన్సెప్ట్ తో ఇది సాగే సినిమానా అనిపిస్తోంది.

రీఎంట్రీలో జజ్ బా, సరబ్ జీత్ లో హుందా పాత్రలో నటించిన ఐష్ ఇందులో తన కన్నా వయసులో చాలా చిన్న అయిన రణ్ బీర్ తో బీభత్సమైన రొమాన్స్ కానిచ్చేసినట్లు తెలిసిపోతుంది. అనుష్క తో ఇంటిమేట్ సీన్ల కన్నా ఐశ్వర్యతో చేసిన సీన్లే హైలెట్ గా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్లాట్ మాత్రం  ఇంట్రస్టింగ్ నే ఉంది. గత కొంతకాలంగా హిట్ లేక బాధపడుతున్న యువహీరో రణ్ బీర్ కి ఈ సినిమా అయినా హిట్ అందిస్తుందో చూదాం. దీపావళికి ఏ దిల్ హై ముష్కిల్ సందడి చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ae Dil Hai Mushkil  Rambir Kapoor  Aishwarya Rai Bachchan  Fawad Khan  

Other Articles