వెయిట్ తగ్గేందుకు అనుష్క పడుతున్న తంట | anushka cycling on hyderabad roads for weight loss

Anushka cycling on hyderabad roads for weight loss

anushka shetty new look, anushka shetty weight loss, anushka shetty sizes, anushka cycling on hyderabad roads, Anushka look for Baghmathi, Anushka look for baahubali 2

anushka shetty cycling on hyderabad roads for weight loss.

అనుష్క సైజులు ఇంకా మారలేదా?

Posted: 08/30/2016 03:19 PM IST
Anushka cycling on hyderabad roads for weight loss

సినిమాల కోసం భారీగా రెమ్యునరేషన్లు తీసుకునే హీరోయిన్లు, మేకప్ వేసుకుని ఏదో తూతూ మంత్రంగా నాలుగు డైలాగులు చెప్పి చెక్కేస్తారని అంతా అనుకుంటారు. కానీ, ఒక సినిమా కోసం హీరోయిన్లు పడే కష్టం ఎలా ఉంటుందో సైజ్ జీరోతో చూపించింది అనుష్క. అమాంతం వంద కేజీలు పైగా పెరిగిపోయిన స్వీటీ అందుకు తగ్గ ప్రతిఫలం అందుకోలేకపోయింది. సినిమా పోతే పోయింది కానీ బరువును తగ్గించుకునేందుకు దాదాపు 8 నెలల నుంచి తెగ కష్టపడుతోంది.

నిజానికి ఆ సినిమా తర్వాత అనుష్క దాదాపు బయట ఎక్కడ కనిపించలేదనే చెప్పాలి. సూర్య తో సింగం-3 లో నటిస్తున్నా... ఎక్కడా ఆమె లుక్ బయటకు రాకుండా చూసుకున్నారు. బాహుబలిలోనూ అంతే సీక్రెట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. దీంతో అనుష్క ఇంకా లావుగానే ఉందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  కానీ, త్వరలో భాగమతి షూటింగ్ లో అనుష్క ఖచ్ఛితంగా పాల్గొనాల్సి రావటం, ఈ సినిమా కోసం స్లిమ్ లుక్ ఖచ్ఛితంగా అవసరం కావటంతో మునుపటి రూపం కోసం అనుష్క తీవ్రంగా కష్టపడుతోందని తెలుస్తోంది.



అయితే వెయిట్ తగ్గేందుకు అనుష్క ఎంతగా కష్టపడుతుందో ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పొద్దుపొద్దునే లేచి ముఖానికి మాస్క్ వేసుకుని హైదరాబాద్ రోడ్లపై దాదాపు 20 కిలోమీట్లరు ఆమె సీక్రెట్ గా సైక్లింగ్ చేస్తోందని వారంటున్నారు. వచ్చే నెలలోనే భాగమతి షూటింగ్ ప్రారంభం కానుందట. దీంతో వీలైనంత త్వరగా కొవ్వు కరిగించేసుకుని షూటింగ్ డే నాటికి రెడీ అయిపోవాలని చూస్తోంది. ఒక్క సినిమా కోసం అమాంతం పెంచేసిన అనుష్క, ఇప్పుడు తగ్గించుకోవటం కోసం ఎంత కష్టపడుతుందోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  new look  Baghmati  

Other Articles