ట్రిపుల్ ఎక్స్ వీడియోను పోస్ట్ చేసిన దీపిక | Deepika Padukone share behind the scenes of xXx

Deepika padukone share behind the scenes of xxx

behind the scenes of xXx Return Of Xander Cage, behind the scenes of xXx, deepika share xXx video, Deepika romance Vin Diesel

Deepika Padukone share behind the scenes of xXx Return Of Xander Cage.

పొట్టి బట్టలో ఉన్న దీపికను ఎత్తుకుని మరీ...

Posted: 07/28/2016 11:37 AM IST
Deepika padukone share behind the scenes of xxx

దీపికా పదుకునే హాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్ షూటింగ్ చకచకా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ లలో దీపిక యాక్షన్ పార్ట్ తోపాటు హాట్ నెస్ ను కూడా చూపించింది. సిక్స్ పాక్ బాడీతోపాటు హీరోతో కూడా కొన్ని రొమాన్స్ సన్నివేశాలలో రెచ్చిపోయినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

అయితే షూటింగ్ తొలిరోజు నుంచే హీరో విన్ డీజిల్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తున్న దీపిక చిత్రంలో కెమిస్ట్రీ కోసం బాగానే కష్టపడింది. మొదటి నుంచి విన్ డీజిల్ తో బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలను రిలీజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరోక వీడియోను పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో షూటింగ్ మధ్యలో జరిగిన సరదా సంఘటనలు, యాక్షన్ పార్ట్ లో ఎలా దుమ్మురేపిందో చూపించింది. అంతేకాదు విన్ డీజిల్ తో కాస్త రొమాన్స్ కలగలిపిన సన్నివేశాలను కూడా అందులో చూపించారు. బీచ్ లో చిట్టి బట్టలో ఉన్న దీపికను స్వయంగా చేతులతో ఎత్తుకుని డీజిల్ మోసుకుని వచ్చే సీన్ చిలిపిగా ఉంది. చిత్రం కోసం ఎంత కష్టపడ్డామో అంటూ సందేశంలో ఆమె పేర్కొంది. మరో నెల రోజుల్లో ట్రిపుల్ ఎక్స్ లో దీపిక షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుండగా, ఆపై ఆమె సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి షూటింగ్ లో జాయిన్ కానుంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  xXx  Vin Diesel  

Other Articles