ఆర్థిక ఇబ్బందులతోనే పవన్ కారు అమ్ముకున్నాడా? | Pawan Sell his Luxurious Car with Financial Troubles

Pawan sell his luxurious car with financial troubles

Pawan Kalyan Mercedes Benz G55, Pawan Kalyan Financial Troubles, Pawan Sell his Mercedes Benz. Pawan Sell Benz car

Pawan Kalyan Sell his Mercedes Benz G55 Luxurious Car with Financial Troubles.

కారు అమ్మడానికి కారణం వేరే ఉందా?

Posted: 07/28/2016 11:28 AM IST
Pawan sell his luxurious car with financial troubles

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తారో తెలీదు. మాములుగా అవార్డుల పంక్షన్ లలో మచ్చుకైనా కనిపించని ఆయన మిర్చి మ్యూజిక్ అవార్డుల పంక్షన్ కు హాజరుకావటం ఆశ్చర్యానికి గురి చేసేదే. అయితే వేడుకకు ఆయన రావడమే కార్యక్రమం మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. తమ అభిమాన నటుడు ఒక్కసారిగా మెరిసే సరికి అభిమానుల ఆనందోత్సవాల్లో మునిగారు. అదే సమయంలో పవన్ కష్టాల గురించి ఓ చర్చ మొదలైంది.

పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంతో నాలుగేళ్ల క్రితం మెర్సిడెజ్ బెంజ్ జి55 మోడల్ కారును కొనుగొలు చేశాడు. రాం చరణ్ పెళ్లి సమయంలో స్వయంగా తానే డ్రైవ్ చేసుకుంటూ ఆ కారులో మెగా తనయుడిని తీసుకొచ్చాడు. కట్ చేస్తే.... ఈ మధ్య ఆ కారు ఎక్కడా కనిపించడం లేదు. ఆఖరికి నిన్న అవార్డుల పంక్షన్ కి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కారులో పవన్ కార్యక్రమానికి హాజరుకావటం ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారితీసింది. పవన్ ఆ కారును అమ్మేశాడని, సొంతగా కారు కొనుక్కొలేని స్థితికి చేరాడని ఒక్కసారిగా దుమారం రేగింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు పవన్ స్వయంగా చెప్పడం ఈ వార్తలకు గట్టి బలాన్ని ఇస్తున్నాయి.

అడిగిన వారికి లేదనకుండా ఎంత పడితే అంత దానాలు చేయటం, వరుస ఫ్లాపులు, సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాణంలో పాలుపంచుకుని చేతులు కాల్చుకోవటం, ఆపై డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవటం కోసం ముందుకు రావటం తదితర విషయాలు తెలిసినవే. వీటివల్లే ఆయన ఆర్థికంగా చితికిపోయారనే సంగతి తెలిసిందే. అందుకే ఇష్టంతో కొనుకొన్నప్పటికీ ఆయా ఇబ్బందులను పూడ్చేందుకు ఈ 2 కోట్ల విలువైన కారును అమ్మేసుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Financial Troubles  sell car  Mercedes Benz G55  

Other Articles