కబాలి పరిస్థితి ఇలాగయితే కష్టం | kabali shocking pre release business

Kabali shocking pre release business

Rajanikanth kabali pre release business, kabali area wise business, kabali shocking business, Rajanikanth kabali mania, kabali release in five star hotels, kabali milk, TN milk association for kabali

Super Star Rajanikanth kabali shocking pre release business

కబాలి పరిస్థితి ఇలాగయితే కష్టం

Posted: 07/18/2016 06:02 PM IST
Kabali shocking pre release business

ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచమంతా ఇప్పుడు ర‌జ‌నీ మేనియాతో ఊగిపోతుంది. సూపర్ స్టార్ 159వ చిత్రం కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగడం ఖాయం. బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సాగింది. మొత్తం 220 కోట్లకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. రిలీజ్ కు ముందే పరిస్థితి ఇలా ఉంటే తర్వాత ఈ ముసలి డాన్ ఆపై ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ సృష్టిస్తాడో.. ఎన్ని రికార్డులకు పంచ్ లు ఇస్తాడో అని చర్చ మొదలైంది.

ఇక ఏరియాల వారిగా జరిగిన బిజినెస్ ను గమనిస్తే...  జాజ్ సినిమాస్ అనే సంస్థ ‘కబాలి’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను రూ.68 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక తెలుగులో షణ్ముగ ఫిలిమ్స్ రూ.32 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. కర్ణాటక హక్కుల్ని ‘లింగా’ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ తీసుకోవడం విశేషం. అతను ఇందుకోసం రూ.10 కోట్లు చెల్లించాడు.

అక్కడ తొలిసారి స్టార్ హెటళ్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా 300 మది చూసే విధంగా బెంగుళూరులోని జెడ‌బ్ల్యూ మారియ‌ట్‌( విట‌ల్ మాల్యారోడ్‌) ల‌తిత్ అశోక్‌, రాయ‌ల్ ఆర్చిడ్‌, క్లొన్ ప్లాజా( ఎల‌క్ట్రానిక్ సిటీ) హోట‌ల్స్‌లో మూడు రోజుల పాటు ఈ చిత్రాన్ని ప్రధర్శించనున్నారంట. ఇక కేరళలో హక్కులు 7.5 కోట్లకు అమ్ముడుపోయాయి.

నార్త్ ఇండియా మొత్తం కబాలి సినిమాను ఫాక్స్ స్టార్ సంస్థ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైట్స్ రూ.15 కోట్లు పలికాయి. అమెరికా-కెనడా రైట్స్ రూ.8.5 కోట్లకు.. మిగతా ఓవర్సీస్ హక్కులన్నీ కలిపి రూ.16.5 కోట్లకు అమ్మినట్లు సమాచారం. శాటిలైట్.. మ్యూజిక్ హక్కుల్ని రూ.40 కోట్లకు అమ్మారట. ఇతర మార్గాల్లో రూ.15 కోట్ల దాకా వచ్చాయి. వెరసి కబాలి ప్రి రిలీజ్ బిజినెస్ అనేక సంచ‌ల‌నాల‌కు తెర తీసే ప‌రిస్థితులు క‌న్పిస్తున్నాయి.

జూలై 22 న ప్రపంచ వ్యాప్తంగా 5000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. బాషా తర్వాత మళ్లీ రెండు దశాబ్దాలకు రజనీ తిరిగి మాఫియాడాన్ అవతారంలో కనిపించబోతుండటంతో అంచనాలు అప్పుడే తారాస్థాయికి చేరిపోయాయి. రిలీజ్ తర్వాత కబాలికి యావరేజ్ టాక్ వచ్చినా చాలు కొన్ని రికార్డులు కనుమరుగు అయిపోవటం ఖాయం. ఇదిలా ఉండగా తమిళనాడు పాల వ్యాపారస్థులు రిలీజ్ రోజు కటౌట్ లకు పాలాభిషేకాలతో వృథా చేయొద్దంటూ తలైవా అభిమానులకు విజ్నప్తి చేస్తున్నారు.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajanikanth  pre release  business  five star hotels  

Other Articles