బంగారు బాబు అసలు కథ అదా? | Babu Bangaram is a pakka action drama

Babu bangaram is a pakka action drama

Babu Bangaram an action drama, Venkatesh Babu Bangaram, Venky Babu Bangaram release date, Babu Bangaram songs

Venkatesh Babu Bangaram is a pakka action drama.Babu Bangaram is an action drama in which Venkatesh has performed 5-6 high voltage action sequences and the movie will have lot of action sequences.

బంగారు బాబు అసలు కథ అదా?

Posted: 07/18/2016 05:39 PM IST
Babu bangaram is a pakka action drama

విక్టరీ వెంకీ అప్ కమింగ్ సినిమా బంగారు బాబు రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ లోపు సినిమా కథ గురించి ఓ హింట్ ఇప్పుడు అందుతోంది. గతంలో మారుతి ఈ చిత్రం పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని, ఫన్నీ పోలీస్ గా ఏసీపీ కృష్ణ రోల్ లో వెంకీ నటించబోతున్నాడని ప్రకటించాడు.

కానీ, తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.... బాబు బంగారం పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చిదిద్దాడంట మారుతి. సినిమాలో ఐదు నుంచి 6 ఫైట్లతోపాటు పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ దట్టించాడని తెలుస్తోంది. అంతేకాదు వెంకీ-నయన్ ల మధ్య లవ్ ట్రాక్ ను కూడా అద్భుతంగా తీశాడంట.

ఏజ్ బార్ అవుతున్న పెళ్లి కానీ ఓ పోలీస్ ఆఫీసర్, పెళ్లంటేనే అసహ్యించుకునే ఓ యువతిని ఎలా లవ్ లో పడేశాడు, ఆపై వారి మధ్య ప్రేమాయణం ఎలా సాగింది అన్న కథాంశంతో ఉండబోతుందట. గిబ్రాన్ సమకూర్చిన స్వరాలను ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది.

-భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babu Bangaram  venky  nayanatara  maruthi  ACP Krishna  

Other Articles