ఆలీకి సీనియర్ నటి పంచ్ | sushasini punch to ali for adult jokes

Sushasini punch to ali for adult jokes

Suhasini Ali, senior actress satires on Ali, Ali adult jokes at SIIMA

Senor Actress Suhasini indirectly satires on Ali for Adult jokes at SIIMA

ఆలీకి సీనియర్ నటి పంచ్

Posted: 07/05/2016 11:31 AM IST
Sushasini punch to ali for adult jokes

ఏ పంక్షన్ అయినా , అక్కడ అతిరథ మహరథులు ఉన్నా సరే అడల్ట్ జోకులు పేలుస్తుంటాడు అలీ. అయితే ఆ మధ్య బాగా విమర్శలు వినిపించడంతో వెనక్కి తగ్గినట్లు కొన్నాళ్లు నటించాడు. కానీ, బుధ్ది పోనిచ్చుకోకుండా మళ్లీ బూతు పురాణం వల్లవేస్తున్నాడు. తాజాగా సైమా కూడా ఇందుకు వేదికయ్యింది. అయితే ఈసారి అలీకి అనుకోని వ్యక్తి నుంచి సాలిడ్ పంచ్ పడింది.

సైమా వేడుకల్లో చిరంజీవికి సన్మానం జరిగిన సమయంలో, ఆయన గురించి మాట్లాడుతున్న సమయంలో కూడా అలీ అడల్ట్ జోకులు పేల్చాడు. చిరు గురించి ఆయనతో నటించిన హీరోయిన్ల గురించి డబుల్ మీనింగ్ డైలాగులు వాడాడు. అయితే స్టేజిపై హడావుడిలో ఉన్నవారంతా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ,సీనియర్ నటి సుహసిని అవి గుర్తుపెట్టుకుని అలీపై ఇండైరక్ట్ గా పంచ్ లు వేసేసింది.

కార్యక్రమం చివర్లో ఆమె మాట్లాడుతూ... అలీ మరియు మిగతావారు తమ యాంకరింగ్ తో అలరించారు. అది బాగానే ఉంది. కానీ, దయచేసి ఆడవాళ్లను, చిన్నపిల్లలను అవమానించేలా జోకులు మాత్రం వేయకండి అంటూ పేర్కొంది. ఆ చురకలు అలీని ఉద్దేశించి అంటించివని తెలిసిందే. కార్యకమ్రం అయిన తర్వాత అలీ ఆ విషయంపై ఆమెకు వివరణ ఇవ్వగా, మరోసారి ఇలాంటివి చేయొద్దంటూ ఆమె సున్నితంగానే అలీని హెచ్చరించిందట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  Suhasini  SIIMA 2016  

Other Articles

Today on Telugu Wishesh