పూరీ మళ్లీ అదే పని చేశాడు | kalyan ram ISM Movie first look released

Kalyan ram ism movie first look released

Puri jagannath Kalyan ram, Puri ISM first look, Kalyan ram Mass avatar in Ism, Kalyan ram ISM

Puri jagannath released kalyan ram ISM Movie first look.

పూరీ మళ్లీ అదే పని చేశాడు

Posted: 07/05/2016 10:18 AM IST
Kalyan ram ism movie first look released

దర్శకుడు పూరీ జగన్నాథ్ చిత్రాల టైటిళ్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వర్మ శిష్యుడు కావటం మూలానో, మరేయితర కారణమో తెలీదు కానీ క్యాచీ పేర్లతో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడం ఆయన స్టైల్. ఎంత స్టార్ హీరో అయినా ఆ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడు. ఇప్పడు మరోసారి కూడా అదే పని చేశాడు.

కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ నందమూరి ఆర్ట్స్  పై పూరీ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విడుదల చేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.  'ఇజం' అనే టైటిల్ దీనికి ఫిక్స్ చేసేశాడు. ముందుగా దీంతోపాటు 'రిపోర్టర్ బాలకృష్ణ' అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెప్పినప్పటికీ ఫైనల్ గా ఇజం నే లాక్ చేశాడు.

ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో, సోమవారం సాయంత్రమే ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో హ్యాట్ పెట్టుకుని .. బీడీతో దమ్ము కొడుతూ .. మెడలో సిల్వర్ చైన్ తో చాలా రఫ్ లుక్ తో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. ఫస్టులుక్ తోనే పూరీ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని అర్థమవుతోంది. త్వరలో ఈ చిత్ర టీజర్, ఆడియో విడుదల చేయనున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri jagannath  Kalyan ram  ISM movie  first look  

Other Articles