అనుభవం లేకుండానే వెంటపడుతున్నారంట | Manjima Mohan excited about her debut

Manjima mohan excited about her debut

Manjima Mohan interview, Manjima Mohan about her debut, Manjima Mohan about Gautham Menon, మాంజిమా మోహన్ ఇంటర్వ్యూ, మాంజిమా మోహన్ గౌతమ్ మీనన్ గురించి

Manjima Mohan excited about her debut. Manjima says who is being launched by Gautham Vasudev Menon in his upcoming bilingual film Achcham Yenbadhu Madamaiyada (AYM), starring STR in the lead, couldn’t have asked for a better debut.

అనుభవం లేకుండానే వెంటపడుతున్నారా?

Posted: 06/30/2016 10:12 AM IST
Manjima mohan excited about her debut

హీరోయిన్లు తమ డెబ్యూ సినిమాలకు ఎగ్జయిట్ అయిపోవటం సహజమే. కానీ, ఒక చిత్రంతో ఒకేసారి రెండు భాషల్లో అయితే ఆ ఆనందమే వేరు. ప్రస్తుతం మంజిమా మోహన్ ది అదే పరిస్థితి. ఆమె నటించిన మొదటి చిత్రం ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ అవ్వబోతుంది. ఇంతకీ ఆమెను పరిచయం చేసేది ఎవరో తెలుసు కదా స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్.

తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అంటూ నాగ చైతన్యతో జత కట్టి, దాని తమిళ్ వర్షన్ ‘అచ్చం యెన్ బదు మాదామైయాదా’ లో శింబుతో ఆడిపాడింది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి తెగ పొగిడేస్తుంది. ఏ నటీనటులకైనా గౌతమ్ ఓ మంచి టీచర్. ఆయన చెప్పే విషయాలను విని ఫాలో అయిపోతే చాలు ఉత్తమ నటులుగా ఎదిగిపోతారంటూ చెబుతోంది. నిజానికి ఈ అమ్మడు మళయాళ చిత్రాల సీనియర్ కెమెరామెన్ విపిన్ మోహన్ కూతురు. అయినప్పటికీ నటనలో అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చిందట.

ఇక తొలి సినిమాయే గౌతమ్ మీనన్ లాంటి స్టార్ డైరక్టర్ తో అనేసరికి మంజిమా వణికిపోయిందట.  కానీ ఆయన ఎంతో ప్రోత్సహించి తాను బాగా నటించేలా చేశారని చెప్పింది. ఈ సినిమా చేస్తోన్న దగ్గర నుంచే ఈ రెండు భాషల్లోను ఆఫర్లు చాలానే వస్తున్నాయనీ, ఈ సినిమా విడుదలయ్యాక చూద్దామని ఇంకా ఏ సినిమా కమిట్ కాలేదని అంటోంది. అవకాశం ఇస్తే మరోసారి గురువు గారి అదే గౌతమ్ మీనన్ సినిమాలోనే నటించాలని ఉందని చెబుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manjima Mohan  Gautham Menon  Achcham Yenbadhu Madamaiyada  Sahasam Swasaga Sagipo  

Other Articles