ఆ సినిమాతో డేంజర్ వైరస్ వ్యాపిస్తోందట! | virus alert in bollywood for udtha punjab movie

Virus alert in bollywood for udtha punjab link

Udta Punjab, virus, ఉడ్తాపంజాబ్ తో వైరస్, షాహిద్ కపూర్, తెలుగు వార్తలు, మూవీ వార్తలు

Turns out that the leaked version of Shahid Kapoor starrer ‘Udta Punjab’ poses virus threat to those who may download the links! Members of the Bollywood fraternity took to Twitter Wednesday evening to urge people to watch the film only in the theatres.

ఆ సినిమాతో డేంజర్ వైరస్ వ్యాపిస్తోంది!

Posted: 06/16/2016 04:43 PM IST
Virus alert in bollywood for udtha punjab link

సెన్సార్ బోర్డు దెబ్బకి చిక్కుల్లో ఉడ్తా పంజాబ్ సినిమా అంటూ ఇన్నాళ్లూ వార్తల్లో విని విని ఉన్నాం కదా. ఇక ఇప్పడు ఈ సినిమాతో సాధారణ జనాలకు కూడా చిక్కులొచ్చి పడుతున్నాయి ఏంటంటారా? అక్కడికే వస్తున్నాం. బోర్డు వర్సెస్ బాలీవుడ్ గా మారిన ఉడ్తా పంజాబ్ వ్యవహారం బుధవారం మరో కొత్త మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ లో ఎవరో ఈ చిత్రాన్ని లీక్ చేసి పడేశారు. అలర్టయిన నిర్మాతలు వెంటనే స్పందించి ఆన్ లైన్ నుంచి చిత్రాన్ని తొలగించే చర్యలు చేపట్టినప్పటికీ, అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వారు మళ్లీ మళ్లీ అప్ లోడ్ చేస్తున్నారు.

ఈ అప్ లోడ్ లింకులతో అత్యంత ప్రమాదకర వైరస్ కూడా వ్యాపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను గనక స్మార్ట్ ఫోన్ లో చూడాలనుకుంటే మాత్రం ఆ వైరస్ దెబ్బకి ఫోన్ లోని డేటా మొత్తం సమాచారం తుడిచిపెట్టుకు పోతోందని హెచ్చరిస్తున్నారు. అయితే డౌన్ లోడ్ ఆపేందుకే చిత్ర యూనిట్ ఈ రకమైన ప్రచారానికి దిగిందని మరోవాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటికే విడుదలైన ఈ లీకుల ద్వారా చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయ్యింది. ఇప్పటికే పైరసీని వ్యతిరేకిస్తూ చిత్రయూనిట్ తో పాటు, అమీర్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి పలువురు చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని విజ్ణప్తి చేస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Udta Punjab  virus udta punjab  

Other Articles