డ్రైవర్ దెబ్బకి సినిమా షూటింగ్ బంద్ | driver interrupted rekka movie shooting

Driver interrupted rekka movie shooting

driver interrupted rekka movie shooting

driver interrupted rekka movie shooting

డ్రైవర్ దెబ్బకి సినిమా షూటింగ్ బంద్

Posted: 06/16/2016 06:16 PM IST
Driver interrupted rekka movie shooting

బడ్జెట్ ప్రాబ్లమ్ తో లేక టెక్నిషియన్ ల కారణంతోనో, లేక మరేయితర కారణాలతోనో సినిమా షూటింగ్ ఆగిపోయిన ఘటనలు చూశాం. కానీ, ఇక్కడ కారు డ్రైవర్ కారణంగా ఓ తమిళ సినిమా షూటింగ్ ఆగిపోయిన ఘటన చోటుచేసుకుంది. యువహీరో విజయ్ సేతుపతి, లక్ష్మీ మీనన్ జంటగా నటిస్తున్న 'రెక్క' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోంటోంది. ప్రస్తుతం తమిళనాడులోని తిరువయ్యూరులోని పంచనందీశ్వరాలయంలో జరుగుతోంది. సినిమాలో ప్రధానంగా వచ్చే భారీ సన్నివేశాలను తీస్తుండడంతో వాహనాలను కూడా అంతే స్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో స్థానికులు తమ ఇళ్లలోకి వెళ్లలేని విధంగా అక్కడ ట్రాఫిక్ స్తంభించింది.

ఒక స్థానికుడు తన ఇంటి ఎదురుగా ఉన్న వాహనాన్ని తీయాల్సిందిగా డ్రైవర్ ను కోరాడు. అయితే సదరు వ్యాన్ డ్రైవర్ మాత్రం పెడసరంగా సమాధానం చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికుడు కాస్త ఘాటుగానే స్పందించాడు. ఇద్దరు దుర్భాషలాడుకుంటూ కొట్టుకునేదాకా వెళ్లారు. దీంతో స్థానికులు గుమికూడి షూటింగ్ ఆపాల్సిందింగా గొడవకు దిగారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించగా, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు షూటింగ్ ను నిలిపేశారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rekka movie  vijaysethupathi  rekka shooting  

Other Articles