నటుడు కమ్ డైరక్టర్ హఠాన్మరణం | actor and director balu anand is no more

Actor and director balu anand is no more

balu anand, actor and director balu anand, heart attack., coimbatore, తాజా వార్తలు, సినీ వార్తలు, entertainment, latest news, kollywood news

kollywood senior actor and director balu anand died due to heart attack. he acted morethan 100 films and also directed for few movies.

నటుడు కమ్ డైరక్టర్ హఠాన్మరణం

Posted: 06/03/2016 04:40 PM IST
Actor and director balu anand is no more

చిత్ర సీమ నుంచి మరో తార నింగికెగసింది. తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు బాలు ఆనంద్ శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఛాతీలో తీవ్రమైన నొప్పిరావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు చెప్పారు. ఆయన పార్థీవ దేహాన్ని కోయంబత్తూర్ లోని స్వగృహంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మృతికి కోలీవుడ్ పరిశ్రమ సంతాపం ప్రకటించింది.

కాగా, మొత్తం వందకు పైగా చిత్రాల్లో నటించారాయన. ఆనంద తోల్లై, నానే రాజా నానే మంత్రి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పిస్తా, అన్నానగర్ ఫస్ట్ స్ట్రీట్, అన్బెశివమ్ వంటి చిత్రాల్లో నటనకు ప్రశంసలు అందుకున్నారు. శివాజీ గణేషన్, రజనీ కాంత్, విజయ్, అజిత్ లాంటి టాప్ స్టార్లతో కలిసి పనిచేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, 62 ఏళ్ల బాలు ఆనంద్ కి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.   

బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balu anand  actor and director balu anand  heart attack.  coimbatore  kollywood  

Other Articles

Today on Telugu Wishesh