శివశంకర్ మాస్టర్ కు కోడలు కష్టాలు | Shiva Shankar Master family in trouble

Shiva shankar master family in trouble

Shiva Shankar Master family in trouble, Shiva Shankar Master family problems, Shiva Shankar Master latest news, Shiva Shankar Master latter, Shiva Shankar Master dance, Shiva Shankar Master songs, Shiva Shankar Master stills

Shiva Shankar Master family in trouble: National award winning choreographer Shivashankar Master who is well known for ... The choreographer who has been facing family problems.

శివశంకర్ మాస్టర్ కు కోడలు కష్టాలు

Posted: 06/03/2016 03:27 PM IST
Shiva shankar master family in trouble

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోని ప్రతి సినిమా, టీవి ప్రేక్షకులకు శివశంకర్ సుపరిచితుడే. ఆయన కంపోజ్ చేసిన పాటలు అద్భుతం. క్లాసికల్ డాన్స్ లో ఆయనకు సాటి ఎవరూ రారు. అలాంటి శివశంకర్ మాత్రం ప్రస్తుతం కష్టాలతో భాధపడుతున్నారు.

తన కుటుంబానికి ఆత్యహత్యకు మించిన మరో దారి లేదంటూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాసారు. ఇంతకీ శివశంకర్ మాస్టర్ కు అంత కష్టం ఏం వచ్చిందని అనుకుంటున్నారా? శివశంకర్ పెద్ద కొడుకుతో 2013లో జ్యోతి అనే బెంగళూరుకు చెందిన అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టుకెక్కారు. అయితే ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో వుంది.

అయితే విడాకులు కోరుతూ తన భర్తే కోర్టుకు వెళ్లారని, అలాగే తనని మానసికంగా వేధించడం వల్లనే పోలీసులను, కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని జ్యోతి చెబుతోంది. అంతేకాకుండా గతంలో తనకు జీవనభృతి ఇస్తానంటూ మాట ఇచ్చిన మామ(శివశంకర్).. మాటతప్పడంతో గత్యంతరం లేక ధర్నా చేస్తున్నాని జ్యోతి చెబుతోంది. తన భర్త ఇంట్లో వుండటానికి కాస్త చోటు మాత్రమే కావాలంటూ జ్యోతి కోరుతుంది. కానీ ఈ విషయంపై మామ శివశంకర్ వాదన మరో విధంగా వుంది.

ప్రస్తుతం కేసు కోర్టులో వున్నప్పుడు ఇలా ఇంటికి వస్తే ఎలా చెప్పండి? ఒకవేళ తను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమె ఏమైనా చేసుకుంటే తాను, తన భార్య జైలులో వుండాలా? అంటూ శివశంకర్ ప్రశ్నిస్తున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి తన కుమారుడిని జ్యోతి తీవ్ర మానసిక వేధనకు గురిచేసిందని, ఎన్నిసార్లు చెప్పిన వినలేదని శివశంకర్ చెబుతున్నారు. ఇప్పటికైనా వారిద్దరూ కలిసి వుంటే తమకేమి అభ్యంతరం లేదని.. కాకపోతే గతంలో జ్యోతి కోటిరూపాయలు కావాలంటూ మానసిక వేధనకు గురిచేసిందంటూ శివశంకర్ చెబుతున్నాడు.

మరి వీరిద్దరి వాదనలో ఎవరివి నిజానిజాలో తెలియాల్సి వుంది. ప్రస్తుతం శివశంకర్ ఇంటిముందు జ్యోతి ధర్నా చేస్తుంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై అటు కోర్టు, ఇటు సిఎం జయలలిత ఎలా తీర్పును అందించనున్నారో చూడాలి.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiva Shankar Master  Jayalalitha  Movie News  

Other Articles