కబాలి పాటల సందడి అప్పుడే! | Kabali Audio Date Fixed

Kabali audio date fixed

Kabali Audio Date, Kabali stills, Kabali posters, Kabali movie updates, Kabali teaser, Kabali, Rajinikanth, Radhika Apte hot stills, Radhika Apte hot videos, Radhika Apte

Kabali Audio Date Fixed: Superstar Rajinikanth upcoming film Kabali. Pa.Ranjith Director. Radhika Apte, Dhansika acts an important roles.

కబాలి పాటల సందడి అప్పుడే!

Posted: 05/25/2016 06:06 PM IST
Kabali audio date fixed

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కబాలి’ని ప్రముఖ నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ‘కబాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ల రెస్పాన్స్ కు సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలను జూన్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ప్రకటించారు. త్వరలోనే అధికారిక తేదిని ప్రకటిస్తామని ఆయన అన్నారు.

అలాగే ఈ సినిమాను జులై 1న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించారు. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందో చూడాలి.

ర‌జ‌నీకాంత్‌, రాధికా ఆప్టే, థ‌న్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు కెమెరా: ముర‌ళీ, సంగీతం: స‌ంతోష్ నారాయ‌ణ్‌, ఆర్ట్: రామ‌లింగం, ఫైట్స్: అన్బ‌రివు, మాటలు: సాహితి, పాట‌లు: సిరివెన్నెల‌, చంద్ర‌బోస్‌, అనంత‌శ్రీరామ్‌, మేక‌ప్‌: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: `దేవి-శ్రీదేవి` స‌తీష్‌, నిర్మాత‌: క‌లైపులి.ఎస్‌.థాను

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika Apte  

Other Articles