ఆ హిట్ సినిమా రీమేక్ లో పవన్..? | Pawan Kalyan getting ready to remake one more Tamil hit cinema

Pawan kalyan getting ready to remake one more tamil hit cinema

Pawan Kalyan, Pawan kalyan latest Cinema, PK, pawan kalyan in remake, Vedalam, Ajith Vedalam, Pawan kalyan as Ajith, Neason, RT Neason, Jilla, Pawan, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, వేడలమ్, నీసన్, జిల్లా, అజిత్

Pawan Kalyan has decided to get into top gear post the dismal show of ‘Sardaar Gabbar Singh’. Close on the heels of launching his yet-untitled film with SJ Suryah, Powerstar, we hear has finally given his nod of approval for the much talked about ‘Vedalam’ remake (He recently said he was approached to star in the film).

ఆ హిట్ సినిమా రీమేక్ లో పవన్..?

Posted: 05/06/2016 11:45 AM IST
Pawan kalyan getting ready to remake one more tamil hit cinema

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. గతంలోలాగా కాకుండా ఈసారి మాత్రం స్పీడుగా షూటింగ్ లకు సిద్దపడుతున్నారు. త్వరలోనే సినిమాలకు సెలవు అంటూ ప్రకటించిన పవన్ బహుశా అందుకే స్పీడుమీదున్నట్లున్నారు. ఇప్పటికే ఎస్. జె సూర్యతో ఓ సినిమాకు ఓకే చేసిన పవన్ మరో సినిమాకు కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం చాలా టైం తీసుకున్న పవన్.. సర్దార్ తర్వాత వెంటనే సూర్యతో సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరో ప్రాజెక్టుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

రీమేక్ లతో మంచి హిట్ లు కొట్టడం పవన్ కళ్యాణ్ కు బాగా వస్తుంది అని టాక్. హిందీలో వచ్చిన దబాంగ్ ను తెలుగులో, పవన్ స్టార్ డమ్ కు తగ్గట్టుగా గబ్బర్ సింగ్ తో చేయడం అది పెద్దహిట్ కావడం అందరికి తెలుసు. ఇలా మరోసారి రీమక్ తో ముందుకురానున్నాడట. ఈ సారి తమిళ సినిమా అజిత్ వేడలమ్ ను తెలుగులో చెయ్యనున్నారట. ఇప్పటికే దీని హక్కులు పొందిన పవన్.. స్టోరీలో కొన్ని మార్పులు కోరినట్లు తెలిసింది. అందుకుగాను ఆర్.టి.నీసన్ ను సంప్రదించినట్లు తెలిసింది. గతంలో ఆర్.టి నీసన్ జిల్లా సినిమాను అద్భుతంగా తీశారు. తాజాగా వెడలమ్ సినిమా రీమేక్ ను ఈయనతో తీయించాలని పవన్ చూస్తున్నారట. దానికి నీసన్ కూడా ఒప్పుకున్నారని.. స్టోరీలో కొన్ని మార్పులకు సిట్టింగ్ కూడా చేశారని తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది మంచి వార్తే. కాగా ఈ సినిమాను ఎస్.జె సూర్య సినిమా షూటింగ్ టైంలోనే స్టార్ట్ చేస్తారా..? లేదంటే ఆ సినిమా తర్వాత స్టార్ట్ చేస్తారా అని చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles