వాడి పెళ్లితో హీరోయిన్లందరూ?? | Vishal wants to see Arya marriage

Vishal wants to see arya marriage

Vishal comments on Arya marriage, Vishal comments on Arya, Arya marriage details, Vishal wants Arya marriage, Arya loves heroines, Vishal loves Varalakshmi, Vishal love story, Arya love story

Vishal wants to see Arya marriage: Kollywood star hero vishal comments on his best friend and kollywood hero Arya... about arya marriage.

వాడి పెళ్లితో హీరోయిన్లందరూ??

Posted: 04/25/2016 12:51 PM IST
Vishal wants to see arya marriage

తమిళ నటుడు విశాల్ తన తోటినటుడైన ఆర్యపై సంచలన కామెంట్లు చేసాడు. తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్యలు మంచి స్నేహితులనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ‘వాడు-వీడు’ అనే సూపర్ హిట్ చిత్రంలో కూడా నటించారు. బయట పలు కార్యక్రమాల్లో కూడా వీరు ఒకరిపైఒకరు సరదాగా కామెంట్లు చేసుకుంటూ వుంటారు.

ప్రస్తుతం వున్న తమిళ హీరోలలో పెళ్లికాకుండా వున్న మోస్ట్ బ్యాచిలర్ బ్యాచ్ లో వీరిద్దరూ వున్నారు. హీరోయిన్ వరలక్ష్మీని విశాల్ పెళ్లిచేసుకోవడానికి సిద్ధంగా వున్నాడు. త్వరలోనే పెళ్లికబురు చెప్పనున్నాడు. కానీ ఆర్య మాత్రం పెళ్లి గురించి పట్టించుకోకుండా అందరూ హీరోయిన్లతో సరదాగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు.

తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ హీరోగా ఆర్యకు క్రేజ్ వుంది. మిస్టర్ మన్మధన్ గా అందరి అమ్మాయిల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. హీరోయిన్లందరికి కూడా ఆర్య ఫేవరేట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆర్య త్వరగా పెళ్లి చేసుకోవాలని విశాల్ కోరుకుంటున్నాడు. ఆర్య త్వరగా పెళ్లి చేసుకోవడం వల్ల మిగతా అమ్మాయిలందరూ కూడా సేఫ్ అవుతారని చెప్పుకొచ్చాడు.

విశాల్ ఎందుకిలా కామెంట్లు చేసాడంటే... ఆర్య అందరితో మంచిగా వుంటాడు, అలాగే కాస్త సరదాగా వుంటాడు కాబట్టి... ఆర్య త్వరగా పెళ్లి చేసుకుంటే.. మిగతా అమ్మాయిలందరూ కూడా ఆర్య ప్రేమ నుంచి తప్పించుకోవచ్చు అనే విధంగా సరదాగా కామెంట్ చేసుంటాడని అందరూ భావిస్తున్నారు. నిజానికి విశాల్ కూడా అదే భావించాడని అందరికి తెలిసిందే. మరి ఆర్య పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకుంటాడో భవిష్యత్తులోనే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Arya  Actress  

Other Articles