Pawan Kalyan | Mangoes | Not Available | Sardaar Gabbar Singh

Sad news for pawan kalyan mangoes lovers

Pawan Kalyan Not Sending Mangoes This Year, Pawan Kalyan Mangoes This Year, Pawan Kalyan Mangoes not available, Pawan Kalyan Mangoes not sending, Pawan Kalyan, Mangoes, Sardaar Gabbar Singh Collections, Sardaar Gabbar Singh

Sad News for Pawan Kalyan Mangoes Lovers: Powerstar Pawan kalyan likes himself to be called as a farmer. Pawan Kalyan used to send mangoes to the friends and well-wishers every year.This time not able to send the fruits because of poor harvest.

ఈసారి కొంతమందికే పవర్ స్టార్ మ్యాంగోస్

Posted: 04/14/2016 05:46 PM IST
Sad news for pawan kalyan mangoes lovers

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది తన ఫాం హౌస్ లో పండించిన స్వచ్ఛమైన మామిడి పండ్లను పలు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు పంపిస్తాడనే విషయం తెలిసిందే. వేసవి కాలం వచ్చిందంటే.. పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ నుంచి మామిడి పండ్లు వస్తాయని వారంతా భావిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం అందరికి మామిడి పండ్లు లభించవని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..... ఈ ఏడాది పంట సరిగ్గా లేదని, కాబట్టి పండ్లు అందరికి పంపించడం సాధ్యం కాదని పవన్ చెప్పుకొచ్చాడు. అయితే సాధ్యమైనంత వరకు పంపించే ప్రయత్నం చేస్తానని తెలియజేసారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ నుంచి ఎవరెవరికి మామిడి పండ్లు అందనున్నాయో చూడాలి.

పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇటీవలే ఉగాది కానుకగా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదలై, కలెక్షన్ల మోత మోగిస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శరత్ మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Mangoes  Not Available  Sardaar Gabbar Singh  news  

Other Articles