Trivikram | A Aa | Teaser | Nitin | Samantha | Anupama Parameswaran

Nithiin a aa teaser released

Nithiin A Aa Teaser, Nithiin A Aa Poster, Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Nithiin A Aa Teaser Released: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

త్రివిక్రమ్ ‘అఆ’ టీజర్ రెస్పాన్స్ అదుర్స్

Posted: 04/14/2016 03:50 PM IST
Nithiin a aa teaser released

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టీజర్ నిన్న సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ ప్రసంశలందుకుంది ఈ ‘అఆ’ టీజర్.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ.... ఈ 'అఆ' టీజర్ అందరి మన్ననలు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ను ప్రేక్షకులు మే నెలలో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. చిత్రం ఆడియోను ఈ నెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. మిక్కి.జె.మేయర్ సంగీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మే నెల ప్రధమార్ధంలో 'అఆ' విడుదల అవుతుందని తెలిపారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయికగా ‘అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో నదియ, అనన్య, ఈశ్వరీ రావు, సన, గిరిబాబు,పోసాని,నరేష్, రావురమేష్, అవసరాల్ శ్రీనివాస్, ప్రవీణ్,రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్ రెడ్డి. నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం-మిక్కి.జె.మేయర్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి. ప్రసాద్; సమర్పణ శ్రీమతి మమత; నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు); కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nithiin  A Aa  Teaser  Samantha  Anupama Parameswaran  

Other Articles