Rahul Ravindran | Movie News | Sardaar Gabbar singh | stills

Rahul ravindran new movie launch

Rahul Ravindran new film launch, Rahul Ravindran movie updates, Rahul Ravindran movies, Rahul Ravindran latest updates, Rahul Ravindran stills, Rahul Ravindran

Rahul Ravindran new movie launch: After making his debut with 'Andhala Rakshasi', Rahul Ravindran has been endearing himself to movie lovers with his sensible story selection and good movies. He is all set to work in a new movie, which was formally launched in Shamshabad today

లీలా టాటాతో రాహుల్ రవీంద్రన్ రొమాన్స్

Posted: 04/02/2016 10:37 AM IST
Rahul ravindran new movie launch

‘అందాల రాక్షసి’ చిత్రం తో మంచి పేరు సంపాదించుకుని, యంగ్ జనరేషన్ సినిమా ప్రేమికులకు దగ్గర అయిన యూత్ఫుల్ హీరో రాహుల్ రవీంద్రన్. వైవిద్యభరితమైన కథలతో మంచి సక్సెస్ ను సంపాదించుకున్న రాహుల్ త్వరలో ఒక కొత్త చిత్రంలో నటించబోతున్నాడు. లీలా టాటా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం తాజాగా శంషాబాద్ లో జరిగింది.

గతంలో గుణశేఖర్ వద్ద పని చేసిన రవికిరణ్ చౌదరి ఈ చిత్రంతో దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. వైష్ణవి క్రియేషన్స్ పతాకం పై, రాజేంద్ర ప్రసాద్ మరియు వెల్లాల చెరువు రవికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ఈ బ్యానర్ లో వస్తోన్న మొదటి సినిమా.

ఏప్రిల్ మూడవ వారం నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది అని దర్శకుడు రవికిరణ్ చౌదరి తెలిపారు. "ఇది పూర్తి వినోదాత్మకం గా సాగే కథ. ఈ చిత్రం లో ఒక కొత్త రాహుల్ రవీంద్రన్ ను చూస్తారు. మంచి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకులు" అని ఆయన అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన వెల్లాల చెరువు రవి కుమార్ మాట్లాడుతూ.... చిత్రం కథ చాలా బాగా వచ్చింది. భారీ తారాగణం తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం . మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు.

కథ - మాటలు - రాజేంద్ర ప్రసాద్, దర్శకత్వం - స్క్రీన్ప్లే - రవికిరణ్ చౌదరి . ఆర్ట్ - రాజ్ కుమార్, .సినిమాటోగ్రఫీ - దేవేందర్ రెడ్డి . సంగీతం - శేఖర్ చంద్ర . నిర్మాతలు - రాజేంద్ర ప్రసాద్ , వెల్లాల చెరువు రవి కుమార్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Ravindran  Movie launch  Sardaar Gabbar singh  stills  

Other Articles