Anna Lezhneva | Pawan kalyan wife | Sreeja wedding | Trailer | Sardaar Gabbar singh

Anna lezhneva in sreeja marriage function

Anna Lezhneva in Sreeja wedding, Pawan kalyan third wife in Sreeja wedding, Anna Lezhneva in Sreeja marriage, Sreeja wedding video, Sreeja marriage video, Sreeja wedding stills, Pawan kalyan wife in sreeja marriage, Sardaar Gabbar singh

Anna Lezhneva in Sreeja marriage function: Powerstar pawan kalyan third wife Anna Lezhneva surprice in Sreeja wedding party.

శ్రీజ పెళ్లిలో కనిపించిన కొత్త ‘వదినమ్మా’

Posted: 04/02/2016 11:31 AM IST
Anna lezhneva in sreeja marriage function

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండవ భార్య రేణు దేశాయ్ తో విడిపోయి అన్నా లెజినెవా అనే రష్యన్ మోడల్ ను మూడవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ రేణు దేశాయ్ ను ఇప్పటికీ కూడా పవన్ ఫ్యాన్స్ ‘వదినమ్మా’ అంటూ సంబోధిస్తూ వస్తున్నారు. అన్నా లెజినెవాతో పవన్ రహస్య వివాహం చేసుకున్న తర్వాత... అన్నా లెజినెవా మీడియా ముందుకు రాలేదు. అసలు ఎలాంటి కార్యక్రమాల్లో కనిపించలేదు. దీంతో రేణు దేశాయ్ నే ‘వదినమ్మా’గా అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

కానీ తాజాగా అన్నా లెజినెవా హాట్ టాపిక్ గా మారిపోయింది. మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరియు మీడియాలకు కనిపించని అన్నా లెజినెవా... మెగా కుటుంబ సభ్యులకు మాత్రం బాగా దగ్గరయ్యిందని తెలుస్తోంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లివేడుకలో అన్నా లెజినెవా అందరితో కలిసిపోయి, సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


Video Source : Avinash avi

శ్రీజ-కళ్యాణ్ లో పెళ్లివేడుకకు సంబంధించిన ట్రైలర్ వీడియోను తాజాగా విడుదల చేసారు. ఇందులో పెళ్లి వేడుక ప్రారంభం నుంచే అన్నా లెజినెవా పాల్గొన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వేడుకలో అన్నా లెజినెవా హైలెట్ గా నిలిచింది. రష్యన్ సంతతికి చెందిన ఈమె.. తెలుగు సాంప్రదాయమైన చీరలో కనిపించి, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ వేడుకకు వచ్చినవారంతా కూడా ఈమె ఎవరంటూ చర్చించుకోకా.. చివరకు పవన్ భార్యేనంటూ ఓ కొలిక్కివచ్చారంట.

అన్నా లెజినెవాకు తెలుగు మాట్లాడటం అంతగా రాకపోయినప్పటికీ.. అందరితో కలిసిమెలిసి సరదాగా వున్నట్లుగా చెబుతున్నారు. శ్రీజ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరుకాలేకపోయినప్పటికీ... అన్నా లెజినెవా వచ్చి తెగ సందడి చేసేసిందని అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ కార్యక్రమాల్లో తరచుగా అన్నా లెజినెవా కనిపిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna Lezhneva  Sreeja Wedding Trailer  Pawan Kalyan  Stills  

Other Articles

Today on Telugu Wishesh