Shilpa Shirodkar | injured | Silsila Pyaar Ka | Mahesh babu

Shilpa shirodkar injured in silsila pyaar ka sets

Shilpa Shirodkar injured, Shilpa Shirodkar injured in Silsila Pyaar Ka, Shilpa Shirodkar hospitalized, Shilpa Shirodkar latest news, Shilpa Shirodkar stills, Shilpa Shirodkar videos

Shilpa Shirodkar injured in Silsila Pyaar Ka sets: Shilpa Shirodkar, who is the sister of Namrata Shirodkar, sustained an injury on the sets of her TV Show 'Silsila Pyaar Ka'.

గాయాలపాలైన మహేష్ వదిన.. క్షేమం

Posted: 03/05/2016 02:17 PM IST
Shilpa shirodkar injured in silsila pyaar ka sets

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వదిన, నమ్రతా శిరోద్కర్ సోదరి, మాజీ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ షూటింగ్ లో గాయపడ్డారు. శిల్పా శిరోద్కర్ ప్రస్తుతం ‘సిల్ సిలా ప్యార్ కా’ అనే హిందీ సీరియల్ లో నటిస్తోంది. ఈ షూటింగ్ లో భాగంగా డైలాగ్స్ చెబుతూ మొట్లు దిగుతుండగా.. ప్రమాదవశాత్తు క్రిందపడిపోయారు. ఆమెకు కాస్త గాయాలయ్యాయి.

వెంటనే శిల్పా శిరోద్కర్ ను యూనిట్ మెంబర్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లుగా యూనిట్ సభ్యులు తెలిపారు. మెట్లపై నుంచి పడినప్పటికీ.. అదృష్టవశాత్తు ఆమె వెన్నుముకకు ఎలాంటి ఫ్యాక్చర్ అవలేదని, ఒకవేళ వెన్నుముకకు ఏదైనా జరిగి వుంటే పరిస్థితి తీవ్రంగా వుండేదని తెలిసింది.

ప్రస్తుతం ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. శిల్పా శిరోద్కర్ ను చూసేందుకు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ వెళ్లినట్లుగా సమాచారం. తీరిక చూసుకొని మహేష్, గౌతమ్, సితారలు కూడా వెళ్లి శిల్పా శిరోద్కర్ ను పరామర్శించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shilpa Shirodkar  Injured  Silsila Pyaar Ka  Mahesh babu  

Other Articles