Megastar Chiranjeevi | Zumba dance | 150th film | Ram charan | Stills

Megastar chiranjeevi zumba dance training

Megastar Chiranjeevi trying Zumba dance, Chiranjeevi Zumba dance, Chiranjeevi dance practice, Chiranjeevi movie updates, Chiranjeevi stills, Chiranjeevi latest news, Chiranjeevi stills

Megastar Chiranjeevi Zumba Dance Training: Megastar Chiranjeevi 150th film director vv vinayak. tamil kaththi remake into telugu. Ram Charan Producer.

150వ సినిమా కోసం మెగాస్టార్ స్పెషల్ డాన్స్

Posted: 03/03/2016 03:56 PM IST
Megastar chiranjeevi zumba dance training

తెలుగు ఇండస్ట్రీలోని అగ్రహీరోలలో అదరగొట్టే డాన్స్ లకు కేరాఫ్ అడ్రాస్ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి డాన్సులకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మాములు ప్రేక్షకులే కాకుండా సినీతారలు సైతం చిరంజీవి డాన్సులకు ఫిదా అయిపోయారు. ఇప్పటికీ హీరోగా 149 చిత్రాలను పూర్తి చేసుకున్న చిరంజీవి... తన 150వ సినిమా కోసం కసరత్తులు మరింత వేగవంతం చేసాడు.

ఇప్పటికే 150వ సినిమా కోసం తన బరువును కాస్త తగ్గించుకొని, యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే మరింత గ్లామర్ లుక్ మరియు బాడీ ఫిట్ నెస్ కోసం జుంబా డాన్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. జుంబా డాన్స్ దాదాపు గంట పాటు చేస్తే శరీరంలోని వంద క్యాలరీలకు పైగా కరిగించుకునే అవకాశం వుందట. అందుకు చిరంజీవి జుంబా డాన్స్ ను ఎంచుకున్నాడు.

ఇక చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే... తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ చిత్రంగా రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Zumba Dance  150th film  Kaththi remake  stills  

Other Articles