Nara Rohith | Tuntari | Audio Launch | Theatrical Trailer | Latha hegde | Release Date

Tuntari movie audio launch

Nara Rohit Tuntari Audio Launch, Tuntari Theatrical Trailer, Tuntari movie audio soon, Tuntari movie stills, Tuntari movie latest news, Tuntari movie updates, Tuntari movie posters, Latha hegde latest stills, Latha hegde in tuntari, Latha hegde hot stills, Tuntari movie, Tuntari stills

Tuntari Movie Audio Launch: Tuntari Movie Audio Launch. Starring Nara Rohit, Latha Hegde. Music Composed By Sai Karthik, Directed by Kumar Nagendra and Produced by Ashok Baba, Nagarjuna under Sri Keerthi Films.

నారా రోహిత్ ‘తుంట‌రి’ ఆడియో విడుదల

Posted: 02/20/2016 09:50 AM IST
Tuntari movie audio launch

శ్రీ కీర్తి ఫిలిమ్స్ బ్యానర్ పై నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘తుంట‌రి’. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్ బాబా,నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. లతా హెగ్డే హీరోయిన్. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, వి.వి.వినాయక్, నారారోహిత్, శ్రీవాస్, కుమార్ నాగేంద్ర, అశోక్ బాబా, నాగార్జున్, తారకరత్న, సాయికార్తీక్, అనిల్ కన్నెగంటి, పవన్ సాధినేని, కోడెల శివరాం, వీరేందర్ గౌడ్, కరణం వెంకటేష్, అరికపూడి పృథ్వీ, సుదర్శన్, పూజిత,ఆనంద్, కల్కి, శ్రీ సుధ, కాశీ విశ్వనాథ్, సంజయ్ రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. థియేట్రికల్ ట్రైలర్ ను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆడియో సీడీలను వి.వి.వినాయక్ విడుదల చేయగా తొలి సీడీని రేవంత్ రెడ్డి అందుకున్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ.... ట్రైలర్ బావుంది. ఫస్ట్ టైం నారా రోహిత్ లో కామెడి యాంగిల్ ను కుమార్ నాగేంద్ర చూపిస్తున్నాడు. దర్శకుడు కుమార్ నాగేంద్ర మంచి చిత్రాలను తీశాడు. తమిళంలో మురగదాస్ కథ అందించిన మాన్ కరాటే చిత్రానికి రీమేక్ ఇది. పాటలు బావున్నాయి. సాయికార్తీక్ మ్యూజిక్ పెద్ద హిట్ కావాలి. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అని అన్నారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.... తమిళ సినిమా మాన్ కరాటేకు ఇది రీమేక్. ఇలాంటి కథను తీసుకొచ్చి నాతో సినిమా చేసినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయితో ఇది నాలుగో సినిమా. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నేను డిపరెంట్ సినిమాలు చేసినా ఈ సినిమా నాకు కూడా డిఫరెంట్ మూవీయే. ఈ కామెడి చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను అని అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.... నారా అంటే క్రమశిక్షణ, నందమూరి అంటే పౌరుషానికి మరో పేరు. ఈ సినిమా తీసిన దర్శకుడు కుమార్ నాగేంద్ర, నిర్మాతలు అశోక్ బాబా, నాగార్జున్ గారికి, దర్శకుడు సాయికార్తీక్ సహా అందరికీ అభినందనలు. అమెరికా సైనం ముప్పై లక్షలు అయితే ఇక్కడ టిడిపి సైన్యం ఆరవై లక్షలు. మనం సినిమాను రెండుసార్లు చూస్తే చాలు ఇంకేవరూ రానక్కర్లేదు. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. మన బాణం, ప్రతినిధి, అయిన రోహిత్ ఇప్పుడు తుంటరి అయ్యాడు. దిల్ సినిమాతో దిల్ రాజు ఎలా అయ్యాడో. తుంటరి సినిమాతో తుంటరి రోహిత్ కావాలని కోరుకుంటున్నాను. రోహిత్ ఎనిమిదో సినిమా. వంద సినిమాలు త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు.

శ్రీవాస్ మాట్లాడుతూ.... నేను బాలయ్య బాబు అభిమానిని. గుండెల్లో గోదారి, జోరు వంటి డిఫరెంట్ సినిమాలను తీసిన దర్శకుడు కుమార్ నాగేంద్ర తీసిన సినిమా ఇది. ఆ రెండు సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నిర్మాతలకు అభినందనలు. నాకు నారా రోహిత్ అంటే చాలా ఇష్టం. తనతో కలిసి సినిమా కూడా చేద్దామని అనుకున్నాను అని అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ.... నారా రోహిత్ సైలెంట్ గా కనపడతాడు కానీ మంచి కామెడి టైమింగ్ ఉన్న నటుడు. మాస్, కామెడి సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఈ సినిమాను ప్రేక్షకులందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. కబీర్ సింగ్ మాట్లాడుతూ... బ్యూటిఫుల్ మూవీ. లవ్, యాక్షన్, డ్రామా. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు.

సాయికార్తీక్ మాట్లాడుతూ... అన్నీ ఎలిమెంట్స్ ఉన్న అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్. రోహిత్ గారు ఇలాంటి సినిమా మొదటిసారి చేస్తున్నారు. పక్కా కమర్షియల్ మూవీ.పెద్ద కమర్షియల్ హిట్ అవుతుంది. అన్నీ రకాలైన పాటలు కుదిరాయి.గతేడాదిలాగానే ఈ ఏడాది కూడా నాకు మంచి విజయాలు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు,ఆర్ట్ఃముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వం: కుమార్ నాగేంద్ర‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tuntari  Nara Rohith  Audio Launch  Theatrical Trailer  Latha Hegde  stills  posters  

Other Articles