Siddharth | Chikkadu Dorakadu | Release Date | Lakshmi menon | Bobby simha

Chikkadu dorakadu movie release date

Siddharth Chikkadu Dorakadu Movie Release Date, Chikkadu Dorakadu Movie stills, Chikkadu Dorakadu Movie latest updates, Chikkadu Dorakadu Movie news, Siddharth stills, Siddharth movies, Siddharth, Lakshmi menon, Bobby simha

Chikkadu Dorakadu Movie Release Date: Tamil actor Siddharth upcoming film Chikkadu Dorakadu. This Movie will be release on 4 march.

ఎట్టకేలకు రానున్న ‘చిక్కడు దొరకడు’

Posted: 02/20/2016 01:05 PM IST
Chikkadu dorakadu movie release date

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సిద్ధార్థ్... గతకొద్ది కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా వుంటున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ.. తమిళంలో పలు సినిమాలతో బిజీగా వున్నాడు. ఇటీవలే తమిళంలో సిద్ధార్థ్ నటించిన ‘అరణ్మనై2’ చిత్రం తెలుగులో ‘కళావతి’ పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది.

దీంతో తన తమిళ చిత్రాలను తెలుగులో విడుదల చేయడానికి సిద్ధార్థ్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా వుంటే ఎప్పుడో విడుదల కావాలసిన ‘చిక్కడు దొరకడు’ చిత్రానికి తాజాగా మోక్షం లభించినట్లుగా కనిపిస్తోంది. తమిళంలో సిద్ధార్థ్ నటించిన ‘జిగర్తండా’ చిత్రాన్ని తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో అనువదిస్తున్నారు.

ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు రిలీజ్ డేట్ దొరకలేదు. అన్ని ఇబ్బందులను క్లియర్ చేసుకొని ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇందులో సిద్ధార్థ్ సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నటనకు గానూ బాబీ సింహ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddharth  Chikkadu Dorakadu  Release Date  Lakshmi menon  Bobby simha  

Other Articles