Shah Rukh Khan | FAN | Jabra Fan Song | Stills

Shah rukh khan fan movie jabra fan song

Shah Rukh Khan FAN Movie Latest Teaser, Shah Rukh Khan FAN Movie Teaser, Shah Rukh Khan FAN Teaser, Shah Rukh Khan Fan movie stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan stills, Shah Rukh Khan birthday stills, Shah Rukh Khan

Shah Rukh Khan FAN Movie Jabra Fan Song: Bollywood star hero Shah Rukh Khan upcoming film FAN. Jabra Fan Song Released.

షారుక్ ఖాన్ ‘జబ్రా ఫ్యాన్’ సాంగ్ అదుర్స్

Posted: 02/17/2016 09:37 AM IST
Shah rukh khan fan movie jabra fan song

‘దిల్ వాలే’ చిత్రం తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’. ఇటీవలే షారుక్ పుట్టినరోజు సంధర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ సినీ హీరో షారుక్ ఖాన్ అభిమాని పాత్రలో షారుక్ ఖాన్ నటిస్తున్నాడు. అభిమాని గెటప్ లో షారుక్ కాస్త నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు.

అయితే తాజాగా ఈ చిత్రంలోని ‘జబ్రా ఫ్యాన్’ సాంగ్ వీడియోను విడుదల చేసారు. ఈ పాట వినడానికి చాలా బాగుంది. పాట చాలా ఎంజాయ్ చేసే విధంగా వుంది. ఈ పాట వీడియో విడుదలై 24 గంటలు గడవకముందే 357,345 మంది ఈ పాటను వీక్షించారు. ఇందులోని పాటలన్నీ ఇదే రేంజులో వుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం వుంది.

మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో ఏప్రిల్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Fan  Teaser  Birthday  Stills  

Other Articles