Nag and NTR attacking on US Boxoffice

Nag and ntr attacking on us boxoffice

Nagarajuna, NTR, Naannaku Prematho, Soggade Chinni Nayana, US, Box Office, Box Office Collections, NTRs Naannaku Pramatho

Nagarjuna and NTR is attacking on US Boxoffice. On Luther kings birth day us announced holiday. Then NTRs Naannaku Prematho and Nagarjunas Soggafe chinni Nayana cinemas will collect more in US.

యుఎస్ లో కుమ్మేస్తున్న ఎన్టీఆర్, నాగ్

Posted: 01/18/2016 01:29 PM IST
Nag and ntr attacking on us boxoffice

సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పటికే హిట్ టాక్ సంపాదించి.. కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక ఒకరోజు తర్వాత వచ్చిన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ గా అదంరిని ఆకట్టుకుంటోంది. కాగా బాక్సీఫీసు వద్ద కూడా రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా వరుస సెలవులు రావడంతో మంచి కలెక్షన్లు రాబట్టాయి. మన దగ్గరే కాకుండా ఓవర్సీస్ లోనూ రెండు సినిమాలు మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ రెండు సినిమాలకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది.

జనవరి 18 మార్టిన్ లూథర్ కింగ్ బర్త్ డే.. ఈ సందర్భంగా యుఎస్ లోని పలు స్టేట్స్ లో సెలవును ప్రకటించారు. ఈ సెలవు దినం సంక్రాంతి సినిమాలకి చాలా పెద్ద ప్లస్.. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలే యుఎస్ బాక్స్ ఆఫీసు ని రూల్ చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండు సినిమాలకు రేపు అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. కావున ఈ రోజు కూడా ఈ సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ వస్తాయని ఆశించవచ్చు. మొత్తానికి అటు సంక్రాంతి సెలవులతో మన దగ్గర కలెక్షన్లతో దుమ్మురేపితే.. ఇక యుఎస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarajuna  NTR  Naannaku Prematho  Soggade Chinni Nayana  US  Box Office  

Other Articles