Jr. NTR’s Nannaku Prematho Movie Controversy

Jr ntr s nannaku prematho movie controversy

Jr. NTR, NTR, Nannaku Prematho, Nannaku Prematho Posters, Nannaku Prematho Contraversy, NTRs Nannaku Prematho contraversy

Most awaiting movie Nannaku Prematho movie is struggling for release which is all set to release on Pongal with Soggade Chinni Nayana and Express Raja movies. It is scheduled for release over 1500 screens all over Andhra Pradesh and Telangana regions.

వివాదంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో..

Posted: 01/10/2016 02:25 PM IST
Jr ntr s nannaku prematho movie controversy

న్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం నాన్నకు ప్రేమతో. డిఫరెంట్ లుక్ తో ఎన్టీఆర్ గెటప్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా నాన్నకు ప్రేమతో పోస్టర్ వివాదానికి దారి తీసింది. ఈ సినిమా నిర్మాత బీవీఎన్‌ఎస్ ప్రసాద్, డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్, హీరో ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు రాష్ట్ర మైనారిటీ కమిషన్ నోటీసులు జారీచేసింది. సినిమా ప్రచారంకోసం నగరంలో వెలిసిన పోస్టర్లపై ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఖాజా తన్వీర్ అహ్మద్ మైనారిటీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ ఉన్న పోస్టర్‌లో హీరోయిన్ అశ్లీలంగా ఉండటంతోపాటు వారి వెనుక భాగంలో పోస్టర్‌లో అల్లా (ఎస్‌డబ్ల్యూటీ), మహ్మద్ ప్రవక్త (పీబీయుహెచ్) పేర్లు, ఖురాన్‌లోని శ్లోకాలు ఉండటం ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని తన్వీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

చట్ట ప్రకారం సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన మైనారిటీ కమిషన్ చైర్మన్ ఆబిద్ రసూల్‌ఖాన్, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, ప్రాంతీయ సెన్సార్‌బోర్డు ఇన్‌చార్జి అధికారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. సినీ నిర్మాత, డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఇందుకు బాధ్యులైన ఇతరులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నగరంలో ఉన్న ఈ పోస్టర్లను వెంటనే తొలగించాలని చైర్మన్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి వారికి తమ క్షమాపణలు తెలిపారు. అంతేకాదు ఆ పోస్టర్‌ను పూర్తిగా మార్చి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. చిత్రంలో కూడా అలాంటి సన్నివేశాలేమి లేకుండా చేసాము అంటూ యూనిట్ తెలిపింది. మేము ఏ మతాన్ని కించపరచాలనుకోలేదని, అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు మా క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ చిత్ర బృందం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles