Prabhas happy with Rolls Royce Car

Prabhas happy with rolls royce car

Prabhas Buys Brand New Rolls Royce Car, Prabhas Brand New Rolls Royce Car, Prabhas Rolls Royce Car, Prabhas latest news, Prabhas latest updates, Prabhas movie news, Prabhas movie updates, Prabhas stills

Prabhas happy with Rolls Royce Car: Young Rebel Star Prabhas happy with his dream brand car. Prabhas upcoming film Baahubali.

హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ కొత్త కారు

Posted: 12/29/2015 05:47 PM IST
Prabhas happy with rolls royce car

‘బాహుబలి’ సినిమాతో భారీ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ ఖరీదైన కారును కొన్నట్లుగా వార్తలొస్తున్నాయి. రోల్స్ రాయిస్ సిరీస్ కు చెందిన లేటెస్ట్ మోడల్ కారును ప్రభాస్ కొనుగోలు చేసాడట. ఆ కారు ఖరీదు అక్షరాల 8 కోట్లని తెలిసింది.

ఆ కారులో లగ్జరీ సదుపాయలన్నీ వున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ కారులో ఇంటీరియర్ అదిరిపోయిందట. ఈ కారు ఇటీవలే డెలివరీ అయినట్లుగా తెలిసింది. ఇంత ఖరీదైన కారును కొన్నందువల్ల ప్రభాస్ తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లుగా సమాచారం.

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఇలాంటి అత్యంత ఖరీదైన కార్లు కొన్న వారి జాబితాలో ప్రభాస్ రెండవ స్థానంలో నిలిచాడు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి కాగా, రెండవది ప్రభాస్ అని తెలుస్తోంది. మిగతావారంతా కూడా దాదాపు రేంజ్ రోవర్, జాగోవర్ కార్స్ వాడుతున్నారు. మరి ప్రభాస్ మొదలెట్టిన ఈ కార్ల ట్రెండ్ ను మిగతా హీరోలు ఫాలో అవుతారేమో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త తెలిసిన ప్రభాస్ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Rolls Royce Car  Baahubali  Movie News  stills  

Other Articles