Kedi Billa Kiladi Rangaa | Regina | Bindhu madhavi | shivakarthikeyan | Stills

Kedi billa kiladi rangaa movie dubbing completed

Kedi Billa Kiladi Rangaa Dubbing Completed, Kedi Billa Kiladi Rangaa stills, Kedi Billa Kiladi Rangaa posters, Kedi Billa Kiladi Rangaa telugu news, Kedi Billa Kiladi Rangaa telugu updaets, Kedi Billa Kiladi Rangaa

Kedi Billa Kiladi Rangaa Movie Dubbing Completed: Tamil hit film Kedi Billa Kiladi Rangaa Dubbing into telugu with same title. Dubbing process Completed. Regina, Bindhu madhavi, shivakarthikeyan, Vimal acts in lead roles.

డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న ‘కేడి బిల్లా-కిలాడి రంగా’

Posted: 12/09/2015 10:54 AM IST
Kedi billa kiladi rangaa movie dubbing completed

సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ తమిళ డైరెక్టర్‌ పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. రాజ్‌ కందుకూరి సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రెజీనా ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ కాగా.. కోలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్‌గా పేరు గడించిన మన తెలుగమ్మాయి బిందుమాధవి మరో హీరోయిన్‌. విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌రాజా స్వర సారధ్యం వహించారు. ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. త్వరలో పాటలు విడుదల కానున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. ‘నేను అభిమానించే నిర్మాతల్లో రామసత్యనారాయణగారు ఒకరు. ఆయనతో అసోసియేట్‌ అవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నా.. అది ఇప్పటికి కుదిరింది. తమిళంలో సూపర్‌హిట్టయిన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం కచ్చితంగా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది’ అన్నారు.

భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘రాజ్‌ కందుకూరిగారి సమర్పణలో ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయనది గోల్డెన్‌ హ్యాండ్‌. రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌, విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్‌, పాండిరాజ్‌ దర్శకత్వ ప్రతిభ, యువన్‌ శంకర్‌రాజా సంగీతం ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఎడిటింగ్‌: డా॥శివ వై.ప్రసాద్‌, ఆడియోగ్రఫి: శేషు కె.యం.ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.సత్యనారాయణ, మ్యూజిక్‌: యువన్‌ శంకర్‌రాజా, సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kedi Billa Kiladi Rangaa  Stills  Posters  News  Chennai  

Other Articles